Pushpa 2: పుష్ప2 సినిమా ఖాతాలో అరుదైన రేర్ రికార్డ్ చేరిందిగా!

రాజమౌళి (Rajamouli) డైరెక్షన్ లో నటించకపోయినా బన్నీ తన టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతున్న సంగతి తెలిసిందే. బన్నీ (Allu Arjun) సుకుమార్ (Sukumar) కాంబినేషన్ క్రేజీ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ సినిమాలు ప్రేక్షకులను అంచనాలను మించి మెప్పిస్తున్నాయి. పుష్ప ది రూల్ (Pushpa 2: The Rule) నుంచి ఇప్పటివరకు ఒక పాట మాత్రమే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫస్ట్ సింగిల్ అరుదైన రికార్డులను టచ్ చేస్తోంది. పుష్ప ది రూల్ ఫస్ట్ సింగిల్ కు ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.

ఈ సాంగ్ కు 2.26 మిలియన్ల లైక్స్ వచ్చాయి. ఈ సినిమా నుంచి మరికొన్ని గంటల్లో సెకండ్ సింగిల్ విడుదల కానుంది. 2024 సంవత్సరం ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ఖాతాలో రిలీజ్ కు ముందే అరుదైన రికార్డులు చేరడంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

సెకండ్ సింగిల్ కూడా హిట్టైతే మాత్రం పుష్ప ది రూల్ భారీ రేంజ్ లో ఉండబోతుందని క్లారిటీ వచ్చేసినట్టేనని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ ఆల్బమ్స్ ఏవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. పుష్ప ది రూల్ సినిమా రిలీజ్ కు మరో 75 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రమోషన్స్ విషయంలో వేగం పెరగాల్సి ఉంది.

ఈ సినిమా విషయంలో షెడ్యూల్స్ అన్నీ అనుకున్న ప్రకారమే జరుగుతున్నాయని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో మరో ఇండస్ట్రీ హిట్ సాధించబోతున్నామని సుకుమార్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది. బన్నీ ఈ సినిమాతో ఏ రేంజ్ లో ప్రేక్షకులను మెప్పించబోతున్నారో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ కెరీర్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus