Pushpa 2: ‘పుష్ప2’ రష్యా రిలీజ్ పై నిర్మాత క్లారిటీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు రష్యాలో ఉన్నారు. ఆయన నటించిన ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 8న రష్యన్ భాషలో విడుదల కానుంది. ఈ సినిమాను అక్కడ ప్రమోట్ చేయడానికి సుకుమార్, రష్మిక, కొందరు యూనిట్ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ రష్యాకు వెళ్లారు. ‘పుష్ప’ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టిన యూనిట్.. ‘పుష్ప2’ని కూడా రష్యన్ లో విడుదల చేయాలని నిర్ణయించుకుంది. ‘పుష్ప’ విడుదలకు ముందు అక్కడి ప్రేక్షకుల నుంచి లభిస్తున్న స్పందన చూసి ఈ నిర్ణయం తీసుకున్నారట.

అయితే ‘పుష్ప’ సినిమా విషయంలో చేసిన పొరపాటు ‘పుష్ప2’కి చేయకూడదని ముందు నుంచి ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ప2’ని ఇండియాలో ఏరోజు అయితే రిలీజ్ చేస్తారో.. అదే రోజున రష్యాలో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ వెల్లడించారు. ఒక్క రష్యా మాత్రమే కాదు.. ‘పుష్ప2’ని ఇతర విదేశీ భాషల్లో కూడా అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికైతే రష్యా ఫైనలైజ్ చేశామని..

ఇతర దేశాలలో విడుదల విషయమై త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన అన్నారు. ‘పుష్ప’ సినిమా డిసెంబర్ లో విడుదలైంది. క్రిస్మస్ సీజన్ కంటే ముందే సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు ‘పుష్ప2’ విషయంలో కూడా అదే ఫాలో అవ్వాలనుకుంటున్నారు. ‘పుష్ప2’ షూటింగ్ ఎప్పుడో మొదలవ్వాల్సింది కానీ.. ప్రీప్రొడక్షన్ వర్క్ కోసం ఎక్కువ సమయం తీసుకున్నారు. వచ్చే వారం నుంచి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

బ్యాంకాక్ లో రెండు వారాల పాటు షెడ్యూల్ ప్లాన్ చేశారు. అక్కడ అడవుల్లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. పార్ట్ 2 కోసం భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus