టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బన్నీ పుష్ప ది రైజ్ సినిమాతో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధించడంతో పాటు బాహుబలి సిరీస్ తర్వాత మరోసారి నార్త్ ఇండియాలో తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. ఈ సినిమాలోని తగ్గేదేలే డైలాగ్ ఊహించని స్థాయిలో పాపులర్ అయింది. బన్నీ తనదైన శైలిలో ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ డైలాగ్ చెప్పడం ఈ సినిమాకు ఒక విధంగా ప్లస్ అయిందనే సంగతి తెలిసిందే.
పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తగ్గేదేలే అనే డైలాగ్ ను వాడేస్తుండగా ఈ జాబితాలో రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉండటం గమనార్హం. ప్రముఖ క్రికెటర్లు సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, దేవిడ్ వార్నర్ మరి కొందరు క్రికెటర్లు తగ్గేదేలే డైలాగ్ ను చెప్పి ఆకట్టుకున్నారు. కొందరు పొలిటీషియన్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పుష్ప డైలాగ్స్ ను చెబుతున్నారు.
ఫ్లవర్ కాదు ఫైర్ అని చెబుతూ రాజకీయ నాయకులు ఇస్తున్న స్పీచ్ లకు ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇండియన్ సినిమాలో ఏ హీరోకు లేని స్థాయిలో బన్నీ ఇమేజ్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. ఒక సినిమాలోని డైలాగ్ ఈ స్థాయిలో మరేదీ పాపులర్ కాలేదని ప్రపంచవ్యాప్తంగా ఈ అరుదైన రికార్డ్ బన్నీ నటించిన పుష్ప ది రైజ్ కు మాత్రమే సొంతమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
బన్నీకి ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఆ క్రేజ్ మరి కొన్నేళ్ల పాటు తగ్గే ఛాన్స్ లేదని తెలుస్తోంది. పుష్ప ది రూల్ పై కూడా హిందీలో భారీ అంచనాలు నెలకొనగా అక్కడ ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్లను సాధించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ నెలలోనే పుష్ప ది రూల్ రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.