Pushpa Movie: ‘బాహుబలి’ రూట్ లో ‘పుష్ప’!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొంతకాలంగా ఈ సినిమాను ‘బాహుబలి’ స్టైల్ లో రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా చెప్పడానికి స్కోప్ ఉందని.. క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ పెట్టి సెకండ్ పార్ట్ ను కంటిన్యూ చేయొచ్చని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. ఇలా అయితేనే చెప్పిన సమయానికి మొదటి భాగాన్ని రిలీజ్ చేయగలమని అల్లు అర్జున్ తో సుకుమార్ డిస్కషన్స్ చేస్తున్నాడని సమాచారం.

ఫైనల్ గా అల్లు అర్జున్.. సుకుమార్ చెప్పినట్లుగా సినిమాను రెండు భాగాలుగా సినిమాను రిలీజ్ చేయడానికి అంగీకరించాడట. ఇప్పటికే సినిమా షూటింగ్ సగం పూర్తయిందని.. మిగిలిన పోర్షన్ ను పూర్తి చేయడానికి రెండు వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. ఒక్కసారి షూటింగ్ మొదలైతే మిగిలిన పనిని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేయాలని చూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేయడానికి కూడా దసరా లేదా డిసెంబర్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

రెండో భాగం కోసం అల్లు అర్జున్ బల్క్ డేట్స్ ఇవ్వబోతున్నాడట. వచ్చే ఏడాది సెకండ్ హాఫ్ లో రెండో భాగం షూటింగ్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక నటిస్తోంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు యాసలో మాట్లాడతారని సమాచారం.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus