Sai Pallavi: క్రేజీ ప్రాజెక్ట్ లో సాయిపల్లవి.. నిర్మాతలేమన్నారంటే..?

అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ రేంజ్ లో ఈ సినిమాకి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా ‘పుష్ప’ పార్ట్ 2 రాబోతుంది. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ ఫైనల్ చేశారు. రీసెంట్ గా సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ నిర్వహించారు. అయితే ఈ సినిమాకి సంబంధించి మీడియాలో కొన్ని వార్తలొచ్చాయి. సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రష్మిక కంటిన్యూ అవుతూనే..

మరో హీరోయిన్ పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నట్లు ప్రచారం జరిగింది. కథ ప్రకారం.. సినిమాలో గిరిజన యువతి పాత్ర ఒకటి ఉందని.. ఆ రోల్ లో సాయిపల్లవిని తీసుకున్నట్లు కథనాలు వచ్చాయి. దీంతో సాయిపల్లవి ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. క్రేజీ ప్రాజెక్ట్ లో తమ హీరోయిన్ భాగమవుతున్నందుకు సంతోషించారు. తాజాగా ఈ విషయంపై నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. ఓ బాలీవుడ్ మీడియా సంస్థ.. ‘పుష్2’లో సాయిపల్లవి నటిస్తుందా..? అనే విషయాన్ని నిర్మాతల వద్ద ప్రస్తావించగా..

అందులో నిజం లేదని వెల్లడించారు ‘పుష్ప2’ నిర్మాతలు. సినిమాలో అసలు గిరిజన యువతి పాత్రే లేదని తెలిపారు. సాయిపల్లవిని ఎలాంటి పాత్ర కోసం సంప్రదించలేదని చెప్పారు. సినిమాలో అడిషనల్ క్యారెక్టర్స్ లేవని తెలిపారు. ఇక ‘పుష్ప2’ విషయానికొస్తే.. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్లే ఈసారి భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించనున్నారు.

దిశాపటానీ లాంటి బాలీవుడ్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బన్నీ వంద కోట్లకు దగ్గరగా రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్. సుకుమార్ కి రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో వాటాలు కూడా ఇస్తారట. మరి ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి!

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus