Pushpa: రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గిన సుకుమార్!

  • April 7, 2021 / 01:39 PM IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘పుష్ప’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే కొద్దిరోజుల క్రితం ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. అయితే ‘పుష్ప’ అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా విడుదల ఆరు నెలలు వాయిదా పడిందని టాక్.

ఈ ఏడాది ఆగస్టుకి రావాల్సిన ఈ సినిమాను డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారట. సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉండడం, సీజీ వర్క్ ఇలా పలు కారణాల వలన విడుదల తేదీ ఆలస్యమవుతుందని తెలుస్తోంది. హడావిడిగా సినిమా తీస్తే అవుట్ ఫుట్ దెబ్బ తింటుందని.. అందుకే రిలీజ్ విషయంలో వెనక్కి తగ్గితేనే మంచిదని భావిస్తున్నారు. నిజానికి ఈ సినిమా తరువాత బన్నీ.. కొరటాలతో సినిమా చేయాల్సివుంది.

కానీ అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కావడం లేదు. అందుకే బన్నీ-ఎన్టీఆర్ లు మాట్లాడుకొని.. ముందుగా కొరటాల శివను ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ఒప్పించారట. ఆ కారణంగానే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వాయిదా పడిందని తెలుస్తోంది. ముందుగా ఎన్టీఆర్-కొరటాల సినిమా మొదలవుతుంది. కొరటాల స్నేహితుడి స్నేహసుధ బ్యానర్ కు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ను కలిపి ఈ సినిమా మొదలుపెడతారు. ఇది పూర్తయిన తరువాత కొరటాల-బన్నీ సినిమా ఉంటుంది.

Most Recommended Video

వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus