Pushpa: తమిళంలో పుష్ప రేటింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

భాషతో సంబంధం లేకుండా క్రేజ్ ను సంపాదించుకున్న హీరోలలో బన్నీ ఒకరు. రాజమౌళి సపోర్ట్ లేకుండానే పుష్ప ది రైజ్ తో బాలీవుడ్ లో సత్తా చాటిన అల్లు అర్జున్ పుష్ప ది రూల్ సినిమాతో బాక్సాఫీస్ ను మరోసారి రూల్ చేయడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే పుష్ప ది రైజ్ తో ఎన్నో సంచలన రికార్డులు ఖాతాలో వేసుకున్న బన్నీ తాజాగా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.

Click Here To Watch NOW

పుష్ప ది రైజ్ తమిళ, మలయాళ భాషల్లో కూడా ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా పుష్ప ది రైజ్ తమిళ వెర్షన్ టీవీలలో ప్రసారం కాగా ఈ సినిమాకు ఏకంగా 10.69 రేటింగ్ వచ్చిందని బోగట్టా. తమిళంలోకి డబ్ అయిన సినిమాల్లో టాప్ టీఆర్పీ రేటింగ్ సాధించి పుష్ప ది రైజ్ నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమాకు ముందు సైరా నరసింహారెడ్డి, 1 నేనొక్కడినే, అల వైకుంఠపురములో సినిమాలు ఉన్నాయి.

పుష్ప ది రైజ్ తమిళంలోకి డబ్ అయిన టాలీవుడ్ సినిమాలలో టాప్ 4 సినిమాలలో ఒకటిగా నిలిచినా అల వైకుంఠపురములో టీఆర్పీ రేటింగ్ ను బ్రేక్ చేయలేదు. మరోవైపు పుష్ప ది రైజ్ లో పుష్పరాజ్ పాత్ర బన్నీ కాకుండా ఎవరు పోషించినా ఆ సినిమా ఈ రేంజ్ హిట్టైతే అయ్యేది కాదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రైజ్ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో బన్నీ కూడా కెరీర్ విషయంలో జాగ్రత్తగా ముందడుగులు వేస్తున్నారు.

బన్నీ భవిష్యత్తు ప్రాజెక్టులకు సంబంధించి వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వస్తున్నా స్వయంగా బన్నీ చెబితే తప్ప ఆ వార్తల్లో నిజానిజాలను ధృవీకరించలేం. మరోవైపు బన్నీ సైతం తన రేంజ్ కు తగిన స్థాయిలో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు. బన్నీకి అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సైతం ముందుకొస్తున్నారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus