Pushpa: పుష్ప ది రూల్ మూవీ ఫస్ట్ సింగిల్ ఆరోజే విడుదల కానుందా?

అల్లు అర్జున్ (Allu Arjun) సుకుమార్ (Sukumar) కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ (Pushpa 2)  మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఏప్రిల్ నెల 8వ తేదీన విడుదల కానుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 8వ తేదీ బన్నీ పుట్టినరోజు కావడంతో ఈ తరహా వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. పుష్ప ది రూల్ సినిమా బన్నీ ఫ్యాన్స్ కు స్పెషల్ మూవీ అనే సంగతి తెలిసిందే.

బన్నీ పుట్టినరోజు కానుకగా బన్నీ కొత్త సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఏమైనా వస్తాయేమో చూడాల్సి ఉంది. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల కానున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. పుష్ప ది రూల్ సినిమా కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ సినిమాలో యాక్షన్ సీన్స్ తో ఎమోషనల్ సీన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ సినిమాలో రష్మిక (Rashmika Mandanna) పోషిస్తున్న శ్రీవల్లి పాత్ర చుట్టూ చాలా డ్రామా ఉంటుందని సమాచారం. అనుకున్న తేదీకి ఈ సినిమాను రిలీజ్ చేయడం కోసం మేకర్స్ ఎంతగానో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ బన్నీ రేంజ్ ను ఎన్నో రెట్లు పెంచేలా ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బన్నీ సినీ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ మూవీగా నిలుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో పాన్ ఇండియా సినిమాలేవీ విడుదల కాలేదనే సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే ఛాన్స్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus