Pushpa2: పుష్ప2 బడ్జెట్ మళ్లీ పెరిగిందట.. ఎన్ని కోట్లంటే?

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఏకంగా 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కి బడ్జెట్ విషయంలో ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అయితే భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా విజయాలను సాధిస్తున్న నేపథ్యంలో పుష్ప2 మూవీ బడ్జెట్ ను నిర్మాతలు భారీగా పెంచారని సమాచారం అందుతోంది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 400 కోట్ల రూపాయలు అని సమాచారం.

హిందీలో కూడా ఈ సినిమాకు భారీస్థాయిలో ఆఫర్లు వస్తుండటంతో ఈ సినిమాకు బడ్జెట్ ను పెంచాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. అయితే 400 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే ఒక విధంగా రిస్కీ బడ్జెట్ అనే చెప్పాలి. అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యే అవకాశం ఉండటం కూడా ఈ సినిమాకు ఒకింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. పుష్ప ది రూల్ ను ఆలస్యంగా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

జూన్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఫస్ట్ పార్ట్ ను మించి సెకండ్ పార్ట్ ఉండే విధంగా మేకర్స్ ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్లు ఈ సినిమా కోసం పని చేయనున్నారని బాలీవుడ్ నటీనటులకు కూడా పుష్ప2 లో ప్రాధాన్యత దక్కనుందని తెలుస్తోంది. 2023 సమ్మర్ లో ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.

బన్నీ హీరోగా తెరకెక్కి సమ్మర్ లో విడుదలైన పలు సినిమాలు అంచనాలకు మించి సక్సెస్ సాధించాయి. పుష్ప ది రూల్ లో రష్మికతో పాటు మరో బాలీవుడ్ హీరోయిన్ కు చోటు దక్కనుందని తెలుస్తోంది. పుష్ప ది రూల్ లో మెజారిటీ సన్నివేశాలను విదేశాలలో చిత్రీకరించనున్నారని బోగట్టా. వరుస విజయాలతో జోరుమీదున్న బన్నీ పుష్ప2 సక్సెస్ తో హ్యాట్రిక్ సాధిస్తారని అల్లు అర్జున్ అభిమానులు భావిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఆర్ఆర్ఆర్ మూవీతో పుష్ప2 పోటీ పడుతుండటం గమనార్హం.

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus