Allu Arjun, Sukumar: ‘పుష్ప’రాజ్‌ జోరు పెంచుతున్నాడా.. ప్లేస్‌ మార్చాడు!

‘పుష్ప’ సినిమా ఫలితం తెచ్చిన మార్పో… అందులో కనిపించిన కొన్ని డ్రాబ్యాక్స్‌ వల్లనో కానీ.. ‘పుష్ప 2’ విషయంలో సుకుమార్‌ చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్‌ ఏడాది సమయం తీసుకున్న ఆయన.. షూటింగ్‌ విషయంలో కూడా అంత కంగారు పడటం లేదు. జాగ్రత్తగా చేద్దాం, అన్నీ సరిచూసుకొని చేద్దాం అనే మోడ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో షూటింగ్‌ షెడ్యూల్స్‌ లెంగ్తీగా ఉండకుండా చూసుకుంటున్నారు. పదేసి రోజుల షెడ్యూల్‌ పెడుతున్నారు. తాజాగా కొత్త షెడ్యూల్‌ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కొత్త షెడ్యూల్‌ కోసం టీమ్‌ వాల్తేరు వెళ్లబోతోంది. గురువారం షూటింగ్‌ కోసం బన్నీ వైజాగ్‌ వెళ్తున్నాడట. ఇప్పటికే మిగిలిన టీమ్‌ అక్కడికి చేరుకుందని తెలుస్తోంది. మొన్నీమధ్యే హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకున్న టీమ్‌.. ఇప్పుడు వైజాగ్‌కు మకాం మార్చేసింది. అక్కడ వాల్తేరు ప్రాంతంలో షూటింగ్‌ ఉంటుందని తెలుస్తోంది. ‘పుష్ప 1’ కోసం కాకినాడ పోర్టులో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. కానీ రెండో పార్టు కోసం వైజాగ్‌ పోర్టును ఎందుకు ఎంచుకున్నారో తెలియాల్సి ఉంది.

విశాఖపట్నంలో టీమ్‌ పది రోజులకిపైగా చిత్రీకరణ జరపున్నట్టు తెలిసింది. అక్కడి నుండి తిరిగి హైదరాబాద్‌ వచ్చేస్తారని సమాచారం. ఇక కథానాయిక రష్మిక వచ్చే నెలలో సినిమా సెట్లోకి అడుగుపెడుతుంది. థాయిలాండ్‌లో కూడా సినిమా షూటింగ్‌ చేస్తారు అని చెబుతున్నారు. దాని బట్టి చూస్తే పుష్పరాజ్‌ ఈసారి విదేశాల్లో కూడా హవా చూపించబోతున్నాడని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే ఓసారి థాయిలాండ్‌లో ట్రయల్‌ షూట్‌ చేశారని కూడా టాక్‌. ఈ సినిమాలో బన్నీ – పులి ఫైట్‌ ఉండబోతోందని ఆ మధ్య వార్తలొచ్చాయి.

ఇక సినిమాలో కొత్త పాత్రల ఎంట్రీ ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. దాంతోపాటు పాత పాత్రలను మరింత బలంగా చూపించే ప్రయత్నమూ చేస్తున్నారట. కీలకమైన అడవి బిడ్డ పాత్రలో సాయిపల్లవి కనిపించనుందని టాక్‌. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుంది అంటున్నారు. దీంతోపాటు కొంతమంది బాలీవుడ్‌ నటులు కూడా నటిస్తారట. అలాగే స్టార్‌ హీరోయిన్‌ ఐటెమ్‌ సాంగ్‌ కూడా ఉంటుందట.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus