Pushpa2: ‘పుష్ప 2’ షూటింగ్ వల్ల జగదీష్ బయటపడతాడా?

ఇటీవల ‘పుష్ప’ నటుడు జగదీష్ .. ఓ జూనియర్ మహిళా ఆర్టిస్ట్ మరణానికి కారణమయ్యాడంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదవ్వడం.. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని 14 రోజులు రిమాండ్ కి తరలించడం జరిగింది. అయితే ‘పుష్ప 2 ‘ లో ఇతని పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుంది అని పార్ట్ 1 చూసిన ప్రేక్షకులకు ఓ ఐడియా ఉంది. కానీ ‘పుష్ప 2 ‘ కి సంబంధించి ఇతని పార్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వలేదు.

ఇది చిత్ర బృందాన్ని కలవరపరుస్తోంది. డూప్ ని పెట్టి కొంత భాగం షూటింగ్ చేయాలని ప్రయత్నించినప్పటికీ అది వర్కౌట్ అవ్వడం లేదు అని తెలుస్తుంది. పైగా క్వాలిటీ విషయంలో దర్శకుడు సుకుమార్ కూడా అస్సలు కాంప్రమైజ్ కాడు. ఈ సినిమా నిర్మాతలైన ‘మైత్రి మూవీ మేకర్స్’ కూడా అంతే..! అందుకే జగదీశ్ ని తిరిగి ‘పుష్ప 2 ‘ షూటింగ్ కి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకోసం దాదాపు రూ.15 లక్షలు వారు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

తమ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే (Pushpa2) ‘పుష్ప’ టీం జగదీష్ కి బెయిల్ వచ్చేలా చేస్తుందట. ఏది ఏమైనా తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఇక ‘పుష్ప’ లో జగదీశ్ కేశవ అనే పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.మొదటి భాగంలో హీరోతో సమానంగా ఈ పాత్రకి స్క్రీన్ స్పేస్ ఉంటుంది. రెండో భాగంలో కూడా అలాగే ఉంటుందని తెలుస్తుంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus