Jr NTR: ఎన్టీఆర్ విషయంలో తగ్గేదేలే అంటున్న బుచ్చిబాబు!

సుకుమార్ డైరెక్షన్ లో బన్నీ నటించిన పుష్ప ది రైజ్ ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే హిందీలో పుష్ప ది రైజ్ విడుదల కాగా అక్కడ ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. పుష్ప విజయం తర్వాత ఇండియా అంతటా బన్నీ పేరు మారుమ్రోగుతోంది. పుష్ప ది రైజ్ సక్సెస్ తో పుష్ప ది రూల్ కు ఊహించని స్థాయిలో బిజినెస్ జరిగింది.

పుష్పరాజ్ పాత్రలో బన్నీ మేనరిజమ్స్ ప్రేక్షకులను ఊహించని స్థాయిలో ఆకట్టుకున్నాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ పై పుష్పరాజ్ ఎఫెక్ట్ పడిందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ బుచ్చిబాబు సినిమాలో లోపంతో బాధ పడతారని కొన్ని రోజుల క్రితమే వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ పాత్ర కూడా పుష్పరాజ్ మాదిరిగా ఉండబోతుందని రా అండ్ రస్టిక్ లుక్ లో తారక్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

దర్శకుడు సుకుమార్ సైతం బుచ్చిబాబు తారక్ కాంబో సినిమా స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని చెప్పుకొచ్చారు. సంథింగ్ స్పెషల్ గా ఈ సినిమా స్క్రిప్ట్ ఉండబోతుందని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ 31వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుందో లేక ఎన్టీఆర్ 32వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో వచ్చే క్రేజ్ అంతకంతకూ పెరిగేలా జాగ్రత్త పడాలని తారక్ అనుకుంటున్నారు.

ప్రశాంత్ నీల్ తారక్ కాంబో మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాలతో పాటు కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus