PVR Inox: సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగిచ్చేస్తారు? పీవీఆర్‌ బంపర్‌ ఆఫర్‌ ట్రై చేస్తారా?

చూసినంత టైమ్‌కి టికెట్‌ డబ్బులు కట్టి.. మిగిలిన డబ్బులు వెనక్కి డబ్బులు చెల్లించకపోతే భలేగా ఉంటుంది కదా. పీవీఆర్‌ ఐనాక్స్‌ (PVR Inox) మల్టీప్లెక్స్ ఛైన్‌ ఇలాంటి ఆఫర్‌నే తీసుకొచ్చింది. దీనిని సింపుల్‌గా చెప్పాలంటే.. థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. అలా వెళ్లిపోతే మిగిలియన సమయం డబ్బులు వెనక్కి ఇచ్చేస్తారు. అయితే దీని కోసం టికెట్‌ కొనేటప్పుడు కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు క్లియర్‌గా ఆఫర్‌ ఏంటో చూద్దాం! మీరు ఓ సినిమాకు వెళ్లారు అనుకోండి.

PVR Inox:

335 రూపాయలు పెట్టి ఓ టికెట్‌ కొన్నారు.. అప్పుడు మరో 40 రూపాయలు ఎక్కువ పెడితే ఓ ఆఫర్‌ మీకు వస్తుంది. అదే సినిమా చూడని సమయానికి డబ్బులు వెనక్కి ఇచ్చేసే ఆఫర్‌. అంటే సినిమా మొదలయ్యాక ఓ గంట తర్వాత సినిమా నుండి బయటకు వచ్చేద్దాం అని అనుకుంటే సుమారు 220 రూపాయలు వెనక్కి ఇస్తారు (PVR Inox) . ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే ఆఫర్‌ ఇలానే ఉంది. అయితే కనీసం గంట థియేటర్‌లో ఉన్నాకే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది అని సమాచారం.

అలాగే అదనంగా 40 రూపాయలు చెల్లించడం అనేది.. కూడా టికెట్‌ రేటు మీద ఆధారపడి ఉంటుంది. అంటే టికెట్‌ రేటులో 10 శాతం చెల్లించాలి అన్నమాట. అంటే టికెట్‌ రేటు 600 రూపాయలు అయితే అదనంగా చెల్లించాల్సిన డబ్బు 600 రూపాయలు అవుతుంది అన్నమాట. అయితే ఈ ఆఫర్‌ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. పూర్తి ఆఫర్‌ బయటకు వస్తే ఇంకా వివరాలు తెలుస్తాయి.

ఇక ఈ ఆఫర్‌ను ప్రయోగాత్మకంగా ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన ప్రాంతాల్లో త్వరలో అమల్లోకి తీసుకొస్తారు అని చెబుతున్నారు. ఒకవేళ ఇది జరిగితే మాత్రం సినిమా ప్రదర్శన రంగంలో సరికొత్త విప్లవం వచ్చినట్లు. ఓటీటీల రాకే ఈ మార్పులకు కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా.

సౌత్‌లో బ్లాక్‌బస్టర్‌… బాలీవుడ్‌ పిలుపు ఆయన నుండే.. ఈసారి ఎవరికంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus