సౌత్‌లో బ్లాక్‌బస్టర్‌… బాలీవుడ్‌ పిలుపు ఆయన నుండే.. ఈసారి ఎవరికంటే?

ప్రతి శుక్రవారం నిర్మాతల దృష్టి ఆ వారం వచ్చే సినిమాల మీద ఉంటుంది. ఎవరైనా మంచి సినిమా తీసి విజయం అందుకుంటే.. ఆ దర్శకుడికి అడ్వాన్స్‌ ఇచ్చేస్తుంటారు. ఈ స్టైల్‌ను ఇప్పుడు బాలీవుడ్‌ నిర్మాతలు ఎక్కువగా వాడుతున్నారు. మన దగ్గర ఇండస్ట్రీ రికార్డులను, లెక్కలను మార్చేస్తున్న / మార్చేసిన దర్శకుల విషయంలో బాలీవుడ్‌ నిర్మాతలు కీన్‌గా అబ్జర్వ్‌ చేస్తున్నారు. అందుకే మన దర్శకులు అటువైపు వెళ్తున్నారు. రీసెంట్‌ టైమ్స్‌లో ఇలా వెళ్లిన దర్శకుల పేర్ల గురించి చూస్తే..

Rajkumar Periasamy

Star Director Rajkumar Periasamy Set To Make Hindi Debut (1)

సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు కనిపిస్తుంది. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో టాలీవుడ్‌లో ఓ రేంజి హిట్‌ కొట్టిన సందీప్‌ రెడ్డి వంగా.. అదే సినిమాతో ‘కబీర్‌ సింగ్‌’ చేసి బాలీవుడ్‌లో కూడా భారీ విజయం అందుకున్నారు. అక్కడి నుండి ఆయన మళ్లీ టాలీవుడ్‌ వైపు రాలేదు. ‘యానిమల్‌’ (Animal) సినిమా చేశారు. ఆ తర్వాత ప్రభాస్‌తో (Prabhas) ‘స్పిరిట్‌’ (Spirit) అనౌన్స్‌ చేశారు. అది కూడా బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలోనే. ఆ విషయం పక్కన పెడితే ఆయనలాగే ‘అమరన్‌’ దర్శకుడు రాజ్‌ కుమార్‌ పెరియసామి (Rajkumar Periasamy)  కూడా బాలీవుడ్‌ వెళ్తున్నారు అని అంటున్నారు.

హిందీలో ఆయనతో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి బాలీవుడ్‌ నిర్మాత భూషణ్‌ కుమార్‌ (Bhushan Kumar) ప్లాన్‌ వేస్తున్నారట. రాజ్‌ కుమార్‌ (Rajkumar Periasamy ) ‘అమరన్‌’ (Amaran) కథను తెరకెక్కించిన విధానం బాగా నచ్చడంతో హిందీలో ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందించాలని భూషణ్‌ కుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారట. త్వరలో ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు. అన్నట్లు తమిళనాట నుండి ఇప్పటికే ‘జవాన్‌’ (Jawan)  సినిమాతో అట్లీ (Atlee Kumar) కోలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ వెళ్లిపోయరు.

ఆ తర్వాత అల్లు అర్జున్‌తో (Allu Arjun)  సినిమా ఉంటుంది అని చెప్పారు కానీ అవ్వలేదు. అయితే సల్మాన్‌ ఖాన్‌తో ఓ సినిమాను అట్లీ ఓకే చేసుకున్నారు అని అంటున్నారు. ఇలా వరుసగా మన సౌత్‌ దర్శకులు బాలీవుడ్‌లో ‘అక్కడి నిర్మాతలతో’ సినిమాలు చేస్తున్నారు. మరికొందరు మన నిర్మాతలతో అక్కడి హీరోలతో సినిమా చేస్తున్నారు.

స్క్రీన్స్‌తో సున్నం పెట్టుకుంటున్న ‘పుష్ప’రాజ్‌.. అంతా సెట్‌ అయినా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus