R Narayana Murthy: టాలీవుడ్‌కి సెన్సార్ కష్టాలు.. ఇలా అయితే సినిమా తీయడం కష్టమే..
- September 7, 2026 / 11:00 AM ISTByFilmy Focus Desk
సినిమాను ఏ వయసు వాళ్లు చూడొచ్చు.. సినిమాలో ఇబ్బందికర అంశాలు ఏమైనా ఉన్నాయా.. సినిమాలో ప్రజల మనోభావాల్ని దెబ్బ తీసే అంశాలు ఉన్నాయా.. ఏదైనా అంశాన్ని వక్రీకరించే అంశాలు ఏమన్నా ఉన్నాయా? ఇలాంటి అంశాలను గత కొన్ని దశాబ్దాలుగా మన సెన్సార్ బోర్డు చూస్తూ వస్తోంది. ఈ క్రమంలో ఓ అడుగు అటు ఇటు పడినా కత్తెర మళ్లీ పట్టండి అని చెప్పడం సెన్సార్ బాధ్యతలు, విధులు. వీటిని చాలా సందర్భాల్లో పక్కాగా చేస్తూ వస్తున్నారు. అయితే లైన్ దాటిన కొంతమంది అలా కత్తెర వేయడం కరెక్ట్ కాదు అని వాదిస్తుంటారు అనుకోండి. అయితే కొన్నిసార్లు అంతగా అవసరం లేని చోట కూడా కత్తెర పడుతున్నారు అనేదే ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
R Narayana Murthy
ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌లో జరుగుతున్న, తీస్తున్న.. సెన్సార్ కత్తెరను దాటొచ్చిన సన్నివేశాలను ఇప్పుడు తీసతుంటే.. సినిమా పేర్లను ఇప్పుడు పెడుతుంటే సెన్సార్ బోర్డు ఒప్పుకోవడం లేదు. దీంతో ‘టాలీవుడ్‌కి సెన్సార్ నొప్పి’ అనే మాట మొదలైంది. రంభ, ఊర్వశి, మేనక ఎలా ఉంటారో ఎవరూ చూడలేదు. ఎలాంటి దుస్తులు వేసుకుంటారో తెలియదు. ఇన్నేళ్లలో సినిమాల్లో చూడటమే. అయితే అప్పుడు వేసిన తరహా దుస్తులను ఇప్పుడు సినిమాలో వేస్తుంటే సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పారు అని అంటున్నారు.

ఇప్పుడు శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో రూపొందిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతోంది అని టాక్. ఇటీవల ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి ఈ మాట చెప్పడంతో ‘అవును.. నిజమే’ అనే క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు ఆయన సెన్సార్ వారికి చేసిన విజ్ఞప్తి కూడా చర్చనీయాంశంగా మరాఇంది. ‘‘ప్రజల కోసం జీవితాల్ని త్యాగం చేసే వారిని కామ్రేడ్స్ అంటారు. కానీ, ఆ పదంపై సెన్సార్ వాళ్లు అభ్యంతరం తెలపడం ధర్మం కాదు’’ అని అన్నారాయన.
సినిమా అనేది ఎంతో మంది శ్రమతో కూడుకున్న పరిశ్రమ. అలాంటి సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టకండి. భావ ప్రకటనా స్వేచ్ఛని అడ్డుకోకండి అని ఆర్.నారాయణమూర్తి రిక్వెస్ట్ చేశారు. ఇదే ఈవెంట్‌లో సీనియర్ దర్శకుడు వీఎన్ ఆదిత్య కూడా ఈ సినిమా గురించి అలానే మాట్లాడారు. తెలుగు సినిమా సెన్సార్ ఇబ్బందుల్లో పడుతోంది. నిర్మాతలను చాలా కష్టాలకు గురిచేస్తోంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో అశ్లీల కంటెంట్‌ను కూడా వదిలేస్తున్నారు. సినిమాలను టార్గెట్ చేస్తున్నారు అని అన్నారు.
రెండో ‘ఎపిక్’ కూడా ఉందా? టైటిల్ అర్థం అదేనా?














