లంగా ఓణీలో లుక్ లో అదరగొడుతున్న రాశిఖన్నా

అందంతో మాత్రమే కాదు అభినయంతోనూ అలరించగల సత్తా తనకు పుష్కలంగా ఉందని “తొలిప్రేమ”తో ప్రూవ్ చేసుకోన్న రాశీఖన్నాకు గ్లామర్ విషయంలోనూ ఎలాంటి హద్దులు, ఇబ్బందులు లేవనే విషయం తన మునుపటి చిత్రాలు చూస్తే అర్ధమవుతుంది. కానీ.. ఇటీవల కాలంలో అభినయ సామర్ధ్యంతోపాటు అందం కూడా సమపాళ్లలో ఉండడం అనేది కంపల్సరీ. లేదంటే.. హీరోయిన్లను పెద్దగా జనాలు కూడా పట్టించుకోవడం లేదు. అందుకే.. రాశిఖన్నా లాక్ డౌన్ లో కూడా స్పెషల్ ఫోటోషూట్ లు చేయించుకొని.. తన అభిమానులని ఎప్పటికప్పుడు పలకరిస్తూ..

వారు పలవరించేలా చేస్తూనే ఉంది. రాశీ ప్రస్తుతం తమిళంలో రెండు, తెలుగులో రెండు సినిమాలు సైన్ చేసింది. సూర్య సరసన ఒక చిత్రం, అరణ్మణై మూడో భాగం. ఈ సినిమాల షూటింగులో ప్రస్తుతం యమా బిజీగా ఉన్న రాశిఖన్నా.. తన సరికొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మాత్రం మరిచిపోవడం లేదు. రీసెంట్ గా లంగా ఓణీలో ముద్దబంతి పువ్వులా అందంగా ఉన్న తన ఫోటోను పోస్ట్ చేసింది. ఇక ఫోటోను చూసినవాళ్లందరూ ఓహో రాశి, ఆహా రాశి అంటూ పొగడ్తల వర్షం కురిపించడం మొదలెట్టారు.

మరి ఈ ఫోటోస్ ఆమెకు ఏదైనా ఆఫర్ తెచ్చిపెడతాయేమో చూడాలి. ప్రస్తుతం ఆమె కెరీర్ తమిళంలో మంచి జోరు మీదున్నప్పటికీ.. తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే చెప్పాలి. ఆమె త్వరగా వేగం పుంజుకోకపోతే.. కొత్తమ్మాయిలు ఆమె స్థానాన్ని, అవకాశాలను కబ్జా చేయడం ఖాయం.

1

2

3

4

5

6

7

More..

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus