Raashi Singh: ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ హీరోయిన్‌ గురించి తెలుసా?

ఎయిర్‌ హోస్టస్‌లు హీరోయిన్లుగా మారడం కొత్తేమీ కాదు. గతంలో కొంతమంది ఇలా ఎయిర్‌ హోస్టస్‌గా చేసి కథానాయికలుగా మారి ప్రేక్షకుల్ని అలరించారు. అయితే ఇటీవల కాలంలో నాయికలు నేరుగా సినిమాల్లోకి వచ్చేస్తున్నారు. రీసెంట్‌ టైమ్స్‌లో తెలుగులో హీరోయిన్‌ వయా హెయిర్‌ హోస్టస్‌ అంటే రిచా పనయ్‌ పేరు చెప్పొచ్చు. ఆ తర్వాత ఎవరు అంటే రాశీ సింగ్‌ అని చెప్పాలి. ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’తో మరోసారి ప్రేక్షకుల్ని పలకరించడానికి వస్తున్న ఆమె గురించి ఆసక్తికర వివరాలు ఇవీ.

సంతోష్‌ శోభన్‌ ‘ప్రేమ్‌ కుమార్‌’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశీ సింగ్‌. ఆ తర్వాత ఈమె… ఆహాలో వచ్చిన ‘పాపం పసివాడు’, శివ కందుకూరి చేసిన ‘భూతద్దం భాస్కర్‌నారాయణ’, సుహాస్‌తో ‘ప్రసన్నవదనం’ సినిమాలు చేసింది. ‘భూతద్దం..’ సినిమా మార్చి 1న విడుదలవుతోంది ఈ నేపథ్యంలోనే ఆమె మీడియాతో మాట్లాడింది. తెలుగు రావడంతోపాటు, ఓ కొత్త అమ్మాయి కావాలని చిత్రబృందం చూస్తున్నప్పుడు ఆడిషన్‌కి వెళ్లి ఆ సినిమాకు ఓకే అయ్యిందట.

రాశీ సింగ్‌ది రాయ్‌పూర్‌. దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుకుంది. సినిమా పరిశ్రమలోకి వచ్చే ముందు ఏడాదిపాటు ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం చేసింది. అయితే చిన్నప్పట్నుంచీ సినిమాలపై ఆసక్తి ఉండేదని, అదే తనను ఇటువైపు తీసుకొచ్చింది అని చెప్పింది. హీరోయిన్‌ కావాలని బలంగా కోరుకున్నానని, అందుకు తగ్గట్టుగా శ్రమించి ‘ప్రేమ్‌కుమార్‌’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను అని తెలిపింది.

మొదట్లో కుటుంబం ముంబయిలో ఉండేది. ఇప్పుడు కుటుంబంతో సహా హైదరాబాద్‌కి మారిపోయింది. తెలుగు సినిమా పరిశ్రమ అంతగా నచ్చేసింది అని చెప్పింది రాశీ. భావోద్వేగాలున్న ఓ ప్రేమకథ చేయాలనేది ఆమె కోరికట. కథలు నచ్చితే గ్లామర్‌ ప్రధానంగా సాగే పాత్రల్నీ చేయడానికి సిద్ధమే అని తేల్చేసింది. దీంతో త్వరలోనే ఆమెను గ్లామర్‌ ప్రధాన పాత్రల్లోనూ చూడొచ్చు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కాస్త పద్ధతైన పాత్రలే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో దర్శకులు ఎలాంటి కథతో ఆమెను (Raashi Singh) అప్రోచ్‌ అవుతారో చూడాలి.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus