Bigg Boss Telugu 5: రేస్ టు ఫినాలే టిక్కెట్ కొట్టే అర్హత అతనికే ఉందా..?

బిగ్ బాస్ హౌస్ లో రేస్ టు ఫినాలే టిక్కెట్ కోసం హౌస్ మేట్స్ మద్యలో ఈవారం పోటీ ఆరంభం అయ్యింది. ఇందులో భాగంగా హౌస్ మేట్స్ ఎన్నో ఛాలెంజస్ ని ఎదుర్కుని పాయింట్స్ ని దక్కించుకోవాలి. ఇలా ఎక్కువ పాయింట్స్ ఎవరైతే సంపాదిస్తారో వాళ్లు ఫినాలే టిక్కెట్ ని సొంతం చేసుకుంటారు. నిజానికి ఇది ప్రతి సీజన్ లో పెట్టే టాస్కే. సీజన్ 2 లో చూసినట్లయితే కౌషల్ ఇది గెలుచుకున్నాడు. ఆ తర్వాత రాహుల్ సిప్లిగంజ్ సీజన్ 3లో గెలుచుకున్నాడు. ఇక సీజన్ 4లో వచ్చి అఖిల్ సార్ధక్ దీన్ని సొంతం చేసుకున్నాడు. ఇద్దరి ఫ్రెండ్స్ అయిన సోహైల్ అఖిల్ మధ్యలో ఈ టాస్క్ అనేది గత సీజన్ లో హైలెట్ గా నిలిచింది.

ఇప్పుడు ప్రస్తుతం సీజన్ 5లో ఏడుగురు ఇంటిసభ్యులు ఉన్నారు. ఇందులో నలుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. మరి వీరిలో రేస్ టు ఫినాలే టిక్కెట్ ఎవరు గెలుచుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. రీసంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో బాల్స్ ని కాపాడుకుంటూ హౌస్ మేట్స్ ఐస్ టబ్ లో నుంచుని ఉన్నారు. ఫస్ట్ ఛాలెంజ్ లో భాగంగా ఇది ఎవరు గెలిచారు అనేది ఆసక్తిగామారింది. టిక్కెట్ టు ఫినాలే అనేది ప్రతి ఇంటిసభ్యుడుకి ఎంతో అవసరం. ఇందులో మూడు టాస్క్ లు నడవబోతున్నాయి. అందులో ఐస్ టాస్క్ లో సిరి, శ్రీరామ్, షణ్ముక్, ప్రియాంకలు ఈ టాస్క్ లో మెడికల్ రూమ్ కి వెళ్లినట్లుగా సమాచారం. ఎక్కువసేపు ఐస్ లో ఉండటం వల్ల ఇలా జరిగిందని చెప్తున్నారు.

అలాగే, సన్నీకి ఇంకా సిరికి కూడా పెద్ద గొడవ జరిగిందట. ఇద్దరూ కూడా మరోసారి ఆర్గ్యూ చేసుకుంటూ రెచ్చిపోయారని టాక్. ఇక పింకీ అండ్ మానస్ ఇద్దరికీ కూడా గట్టి ఫైట్ అయ్యింది. మానస్ ఎట్టకేలకి పింకీపై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశాడు. నువ్వు నాకు నచ్చలేదు అంటూ మాట్లాడాడు. ఇప్పటివరకూ ఎక్కడ హర్ట్ అవుతుందో అని వెయిట్ చేసిన మానస్ చిట్టచివరకి ఈ మాట చెప్పాడు. ఇక గతకొన్ని వారాలే గేమ్ ఉండటం అనేది హౌస్ మేట్స్ లో భయాన్ని నింపుతోంది. రవి ఎలిమినేట్ అయిన దగ్గర్నుంచీ ఎవరు టాప్ 5లో ఉంటారు.? ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది వాళ్లు అస్సలు ప్రిడక్ట్ చేయలేకపోతున్నారు.

ఇక రేస్ టు ఫినాలే గెలిచే అర్హత సన్నీకి ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంటే, మరికొందరు ఫస్ట్ నుంచీ టాస్క్ లలో దూసుకువెళ్తోంది శ్రీరామ్ చంద్ర అని, పైగా ఇప్పుడు తను ఒంటరిగా గేమ్ ఆడుతున్నాడు అని శ్రీరామ్ కే ఈ టిక్కెట్ టు ఫినాలే రావాలని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆ విజేత ఎవరు అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మరి ఈసారి ఫస్ట్ ఫినాలే రేస్ లో ఎవరు ఉంటారు ఆ విజేత ఎవరు అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. అదీ మేటర్.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus