Rachna Banerjee: చిరు, బాలయ్య అలా బిహేవ్ చేస్తారన్న రచనా బెనర్జీ.. ఏం చెప్పారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అయినప్పటికీ చిరంజీవి (Chiranjeevi) , బాలయ్య (Nandamuri Balakrishna) వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి, బాలయ్య సినిమాల కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, బాలయ్యలతో కలిసి నటించిన రచనా బెనర్జీ (Rachna Banerjee) ఒక ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు హీరోల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నాయి. తన సినీ కెరీర్ లో చిరంజీవి, బాలయ్యలతో కలిసి వర్క్ చేయడం బాగుందని ఆమె అన్నారు.

చిరంజీవి చాలా సింపుల్ గా ఉంటారని ఆయనతో కలిసి వర్క్ చేయడం సంతోషాన్ని కలిగించిందని రచనా బెనర్జీ చెప్పుకొచ్చారు. రజనీకాంత్(Rajinikanth) , అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా సాధారణ వ్యక్తులలా ఉండటానికి ఇష్టపడతారని ఆమె అభిప్రాయపడ్డారు. బాలయ్య సెట్స్ లో కోపంగా ఉంటారని ఏదైనా తప్పు జరిగితే బాలయ్య అస్సలు సహించరని ఆమె తెలిపారు. చిరంజీవికి జోడీగా బావగారూ బాగున్నారా (Bavagaru Bagunnara) సినిమాలో నటించిన ఈ బ్యూటీ బాలయ్యకు జోడీగా సుల్తాన్ (Sultan) మూవీలో నటించి మెప్పించారు.

ఈ జనరేషన్ లో బన్నీ(Allu Arjun), చరణ్ (Ram Charan) యాక్టింగ్ అంటే ఇష్టమని చెబుతున్న రచనా బెనర్జీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. రచనా బెనర్జీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటుండగా సరైన ప్రాజెక్ట్ తో రీఎంట్రీ ఇవ్వాలని ఆమె ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రచనా బెనర్జీ వయస్సు ప్రస్తుతం 49 సంవత్సరాలు కాగా స్టార్ డైరెక్టర్ల సినిమాలతో రీఎంట్రీ ఇస్తే ఆమెకు కెరీర్ పరంగా బెనిఫిట్ కలుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రచనా బెనర్జీ తన సినీ కెరీర్ లో అభినయ ప్రధాన పాత్రల్లో ఎక్కువగా నటించారు. మంచి స్టోరీ దొరికితే నటించడానికి అభ్యంతరం లేదని ఆమె వెల్లడించారు. రచనా బెనర్జీకి ఈ జనరేషన్ ప్రేక్షకులలో సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా రచన చిరంజీవి, బాలయ్య గురించి కామెంట్లు చేశారు.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus