Prabhas, Pooja Hegde: ‘రాధేశ్యామ్‌’ స్థాయి పెంచారా… భారం పెంచారా?

ఓ సినిమా ఇచ్చిన విజయంతో నెక్స్ట్‌ సినిమా మీద హైప్‌ పెరగడం గురించి, దాని వల్ల తర్వాతి సినిమా పడే ఇబ్బందుల గురించి మొన్నీ మధ్య మన వెబ్‌సైట్‌లో మాట్లాడుకున్నాం. దీనికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ గురించి కూడా ఇలాంటి మాటలు చెప్పుకోవాలా? ఏమో సోషల్‌ మీడియాలో అయితే ఇదే చర్చ నడుస్తోంది. సినిమా నేపథ్యాన్ని అమాంతంగా మార్చేసి… హైప్‌ కోసం ప్రయత్నించడమే కారణం అంటున్నారు. దీంతో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దీని గురించే చర్చ నడుస్తోంది.

ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వచ్చిన ‘రాధేశ్యామ్‌’ సినిమా ఎట్టకేలకు మార్చి 11కి విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారం మొదలెట్టింది. దర్శకుడు రాధాకృష్ణ సినిమా గురించి వివరంగా చెప్పుకొచ్చారు. ఎప్పుడో 18 ఏళ్ల క్రితమే ఈ పాయింట్‌ అనుకున్నానమని, ఇప్పటికి ఓకే అయ్యిందని చెప్పాడు. దాంతో సినిమా నేపథ్యంగా దేశంలో ఓ హిల్‌ స్టేషన్‌ అనుకున్నామని… కానీ ఆ తర్వాత దాన్ని యూరప్‌ గా మార్చాల్సి వచ్చిందని చెప్పారు. ఈ మాటలే కొత్త చర్చలకు దారి తీశాయి.

రాధాకృష్ణ ఈ సినిమా కథను ‘బాహుబలి’ కంటే ముందే ప్రభాస్‌కి చెప్పారట. ఆలోచన నచ్చడంతో కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేయమని చెప్పాడట. ఈలోపు ప్రభాస్‌ ‘బాహుబలి’ రెండు పార్టులు పూర్తి చేశాడు. ఆ తర్వాత ‘సాహో’ కూడా చేసేశాడు. ఈ క్రమంలో ఆయన ఇమేజ్‌ అమాంతం పెరిగిపోయింది. పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయాడు. దీంతో తర్వాత చేసే సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండాలనే అనధికారిక నియమం పెట్టేసుకున్నాడట.

ఈ కారణంతోనే సినిమా నేపథ్యాన్ని యూరప్‌కి మార్చి, సినిమాకు భారీతనం తీసుకొచ్చారు అని అర్థమవుతోంది. ‘సాహో’ విషయంలో కూడా ఇలానే భారీతనానికి పోయి… నేల విడిచి సాము చేశారనే మాటలు వినిపించాయి. సినిమా విడుదలయ్యాక ఫలితం సమయంలో ఈ మాటలు బాగా వినిపించాయి. అయితే సినిమాకు బాలీవుడ్‌లో మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు ‘రాధేశ్యామ్‌’ విషయంలో అలాంటి ఫలితం రాకూడదు అని ఫ్యాన్స్‌ బలంగా కోరుకుంటున్నారు. అయితే నేపథ్య మార్పు వల్ల సినిమా చూసే ప్రేక్షకులకు సరికొత్త ఫీలింగ్‌ అయితే కలుగుతుంది అంటున్నారు దర్శకుడు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus