రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఫలితం విషయంలో ప్రేక్షకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం రెండేళ్ల తర్వాత తమ ఫేవరెట్ హీరో మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారని అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. హైదరాబాద్ లోని పలు థియేటర్లలో ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు టికెట్లు దొరికే పరిస్థితులు కనిపించడం లేదు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం రాధేశ్యామ్ సినిమాకు శుభవార్తను అందించింది. ఈ సినిమాకు పదిరోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించడం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పలు థియేటర్లలో ఈ సినిమాకు టికెట్ రేట్లు పెరిగాయి. భీమ్లా నాయక్ సినిమా రేట్లతో పోలిస్తే రాధేశ్యామ్ కు చాలా ఎక్కువ మొత్తం టికెట్ రేట్లు పెరగడం గమనార్హం. పేటీఎం వెబ్ సైట్ లో కర్నూలు జిల్లాలోని వీ మెగా ఆనంద్ సినీ కాంప్లెక్స్ లో రాధేశ్యామ్ సినిమాకు రిక్లయినర్ సీట్ల ధర 300 రూపాయలుగా ఉంది.
ఏపీలోని ఇతర ఏరియాలలోని మల్టీప్లెక్స్ లలో రిక్లయినర్ సీట్ల ధర 295 రూపాయలుగా ఉంది. వీ మెగా ఆనంద్ సినీ కాంప్లెక్స్ లో భీమ్లా నాయక్ సినిమా కూడా ప్రదర్శితమవుతుండగా ఈ సినిమాకు మాత్రం రిక్లయినర్ సీట్ల ధర 185 రూపాయలుగా ఉంది. భీమ్లా నాయక్ రిలీజ్ సమయంలో కూడా ఈ సినీ కాంప్లెక్స్ లో టికెట్ రేట్లు తక్కువగానే ఉన్నాయి. అయితే రాధేశ్యామ్, భీమ్లా నాయక్ సినిమాల టికెట్ రేట్ల మధ్య వ్యత్యాసం ఊహించని స్థాయిలో ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
భీమ్లా నాయక్ కు కూడా కొత్త టికెట్ల జీవో అమలై ఉంటే మాత్రం ఈ సినిమా బయ్యర్లు నష్టపోయే అవకాశం ఉండేది కాదని పవన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!