పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రాధే శ్యామ్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. మార్చి 11న విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. మార్నింగ్ షోల నుండీ మంచి టాకే వచ్చినప్పటికీ.. అప్పటికే బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయిపోవడంతో సినిమా కలెక్షన్ల పై ప్రభావం పడింది. అడ్వాన్స్ బుకింగ్ ల కారణంగా మొదటి వీకెండ్ ఈ మూవీ మంచి కలెక్షన్లను నమోదు చేసింది. కానీ ఆ తర్వాత చేతులెత్తేసింది.
తెలంగాణ వంటి ఏరియాల్లో టికెట్ రేట్లు అధికంగా ఉండడం, సినిమాకి కూడా నెగిటివ్ టాక్ రావడం వల్ల కలెక్షన్లు నమోదు కాలేదని స్పష్టమవుతుంది.రూ.196 కోట్లకి ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ చేయగా ఫుల్ రన్లో ఈ మూవీ రూ.86 కోట్ల వరకే షేర్ ను నమోదు చేసి భారీ నష్టాలను మిగిల్చింది.ఆ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వడంతో ‘రాధే శ్యామ్’ థియేట్రికల్ రన్ ముగిసినట్లయ్యింది. అటు తర్వాత 3 వారాలకే ఈ మూవీ ఓటిటిలో దర్శనమిచ్చింది.
విడుదలకి ముందు నుండీ ఈ చిత్రానికి హైప్ ఉండడంతో నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకి అమ్ముడయ్యాయి. థియేట్రికల్ రన్ ముగిసింది కాబట్టి 3 వారాలకే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ విడుదలైంది. థియేటర్లలో మిస్ అయిన వాళ్ళంతా ఈ మూవీని ఎగబడి చూసినట్టున్నారు. అందుకే దెబ్బకి ‘పుష్ప’ రికార్డ్ కూడా బ్రేక్ అయ్యింది. ‘రాధే శ్యామ్’ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన 2 గంటల 5 నిమిషాలకే 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌ను రాబట్టింది.
అంతకు ముందు ఈ రికార్డ్ ‘పుష్ప’ పేరుతో ఉండేది. ‘పుష్ప’ చిత్రం విడుదలైన 8 గంటల 22 నిమిషాలకు 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ ను నమోదు చేసింది. ఇప్పుడు ఆ రికార్డుని ‘రాధే శ్యామ్’ బ్రేక్ చేయడం విశేషం. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.