Radhe Krishna: రాధేశ్యామ్ చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారా?

ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన రాధేశ్యామ్ సినిమాకు రిలీజ్ రోజున నెగిటివ్ టాక్ వచ్చిందనే సంగతి తెలిసిందే. రాధేశ్యామ్ రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ భావించగా ఈ సినిమా కనీవిని ఎరుగని స్థాయిలో నష్టాలను మిగులుస్తోంది. సెకండ్ వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేవని సమాచారం అందుతోంది. శనివారం రోజున ఈ సినిమా కలెక్షన్లు 40 లక్షల రూపాయల కంటే తక్కువ మొత్తమని సమాచారం.

Click Here To Watch NEW Trailer

దాదాపుగా 200 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫుల్ రన్ లో 90 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను కూడా సాధించడం కష్టమేనని తెలుస్తోంది. అయితే రాధేశ్యామ్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ రిజల్ట్ గురించి మాట్లాడుతూ రాధేశ్యామ్ కు విమర్శలు, ప్రశంసలు ఒకే విధంగా వచ్చాయని చెప్పుకొచ్చారు. కొందరి నుంచి సినిమాపై అంత నెగిటివిటీ ఎందుకొచ్చిందో అర్థం కాలేదని రాధాకృష్ణ కుమార్ అన్నారు.

ప్రస్తుతం చాలామంది రాధేశ్యామ్ లో ఎమోషన్స్ బాగున్నాయని చెబుతున్నారని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. నా భార్య సినిమా బాగుందని చెప్పడంతో పాటు ఎమోషనల్ సన్నివేశాలను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారని రాధాకృష్ణ కుమార్ పేర్కొన్నారు. నా భార్య నుంచి రాధేశ్యామ్ కు వచ్చిన ప్రశంసలను మరిచిపోలేనని రాధాకృష్ణ కుమార్ కామెంట్లు చేశారు.

రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత ప్రభాస్ విదేశాలకు వెళ్లడంతో తాను ఆయనను కలవలేదని, మాట్లాడలేదని రాధాకృష్ణ కుమార్ చెప్పుకొచ్చారు. ప్రభాస్ తాను మెసేజ్ లు చేసుకున్నామని సినిమా రిలీజైన తర్వాత మొదటి మూడు రోజులు ప్రభాస్ నా ఇమేజ్ సినిమాను డామినేట్ చేస్తోందని చాలాసార్లు చెప్పారని రాధాకృష్ణ కుమార్ చెప్పుకొచ్చారు. రాధేశ్యామ్ ఫ్లాప్ కావడంతో రాధాకృష్ణ కుమార్ కు ఛాన్స్ ఇచ్చే హీరో ఎవరో చూడాల్సి ఉంది. ప్రభాస్ కెరీర్ పై మాత్రం రాధేశ్యామ్ ప్రభావం పెద్దగా పడలేదని తెలుస్తోంది.

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus