పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుండీ ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘రాధే శ్యామ్’ చిత్రం డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు మొదటి షోతోనే నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. మార్నింగ్ షో ల నుండి సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ నమోదయినప్పటికీ.. బెనిఫిట్ షోలు చూసిన ప్రభాస్ అభిమానులే నెగిటివ్ టాక్ చెప్పడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.
ఓపెనింగ్స్ విషయంలో పర్వాలేదు అనిపించిన ‘రాధే శ్యామ్’ ఆ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘గోపీకృష్ణా మూవీస్’ ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలు కలిసి సుమారు రూ.330 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇదిలా ఉండగా..థియేటర్లలో డిజాస్టర్ అయిన ఈ మూవీని బుల్లితెర ప్రేక్షకులైనా ఆదరిస్తారు అని అంతా అనుకున్నారు. జీ తెలుగు వారు ‘రాధే శ్యామ్’ ప్రీమియర్ ను జూన్ 26న టెలికాస్ట్ చేశారు.
అయితే ఇక్కడ కూడా ఈ చిత్రం ఫలితంలో మార్పు లేదు. మొదటిసారి టెలికాస్ట్ అయినప్పుడు ‘రాధే శ్యామ్’ చిత్రానికి కేవలం 8.25 రేటింగ్ మాత్రమే నమోదైంది. ‘సాహో’ చిత్రాన్ని టెలికాస్ట్ చేసినప్పుడు ఓ రేంజ్లో ప్రమోట్ చేసిన జీ తెలుగు వారు ఈసారి మాత్రం భీమవరంలో ఓ ఫంక్షన్ చేసి సరిపెట్టారు. అది కూడా ఎవ్వరికీ తెలీదు. అందుకే ఇంత తక్కువ టి.ఆర్.పి రేటింగ్ వచ్చి ఉండవచ్చు.
అంతేకాకుండా ‘జీ తెలుగు’ లో టెలికాస్ట్ అయ్యే సినిమాలకి పెద్ద టి.ఆర్.పి రేటింగ్ లు నమోదు కావు అనే బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. అయితే ‘సాహో’ మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఇంకా తక్కువ రేటింగ్ ను నమోదు చేసింది. దాంతో పోలిస్తే ‘రాధే శ్యామ్’ పర్వాలేదు అనిపించింది కానీ ఆశించినంత రేటింగ్ ను అయితే రాబట్టలేకపోయింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే రానున్న రోజుల్లో ప్రభాస్ సినిమాల శాటిలైట్ రైట్స్ దెబ్బ తినే ప్రభావం ఉంది.
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!