Prabhas: రాధేశ్యామ్ నాన్ థియేట్రికల్ బిజినెస్.. మైండ్ బ్లోయింగ్!

రెబల్ స్టార్ ప్రభాస్ గ్లామరస్ హీరోయిన్ పూజా హెగ్డే మొదటిసారి కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దర్శకుడు రాధాకృష్ణ ఎంతో ఆలోచించి రెండేళ్లు కష్టపడి ఈ స్క్రిప్ట్ తయారు చేసి వెండి తెర పైకి తీసుకు వచ్చాడు. నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్ గోపికృష్ణ సంస్థతో కలిసి భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇక సినిమా కరోనా కారణంగా గత ఏడాది నుంచి వాయిదాలు వేసుకొంటూ వస్తున్న విషయం తెలిసిందే.

Click Here To Watch

మార్చిలో ఈ సినిమాను మొత్తానికి విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. రాధేశ్యామ్ సినిమా దాదాపు నిర్మాతలు పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకు వచ్చినట్లుగా తెలుస్తోంది.. శాటిలైట్ రైట్స్ రూపంలో ఈ సినిమా నెవర్ బిఫోర్ అనేలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసినట్లు సమాచారం.. ఇప్పటివరకు ఏమి సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ తరహా లో థియేట్రికల్ బిజినెస్ జరగలేదు అని చెప్పవచ్చు..

రాధే శ్యామ్ సినిమా ఓటీటీ డిజిటల్ శాటిలైట్ హక్కుల రూపంలో దాదాపుగా 250 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా కోసం నిర్మాతలు కూడా అదే తరహాలో లోనే ఖర్చు చేయడం జరిగింది. చివరగా బాహుబలి 2 రెండవ భాగానికి 230 కోట్లకు పైగా నాన్ థియేట్రికల్ గా లాభాలు వచ్చయు. ఇక సాహో కూడా అదే తరహాలో బిజినెస్ చేసింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా రాధేశ్యామ్ సినిమా ఆ రికార్డును బ్రేక్ చేసింది..

మరోసారి ప్రభాస్ నెంబర్ వన్ అనేలా క్రేజీ అందుకున్నాడు. అతనికి 150 కోట్లకు పైగా పారితోషికం ఇస్తున్నారు అంటే అందులో ఎలాంటి ఆశ్చర్యం అవసరం లేదు అనే చెప్పాలి.. ఇక రానున్న రోజుల్లో ఈ బిజినెస్ నెంబర్లు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus