ప్రభాస్ స్పెషల్ సర్ప్రైజ్ రెడీ!

ప్రస్తుతం ప్రభాస్ వరుసగా భారీ ప్రాజెక్ట్ లు చేపడుతున్నారు. అందులో ఒకటి ‘రాధేశ్యామ్’. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ‘రాధేశ్యామ్’ ప్రీ టీజర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ముందుగా ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ ను, ‘సాహో’ సినిమాలో ప్రభాస్ ను గంభీరంగా చూపిస్తూ.. ఇప్పుడు ఆయన హృదయాన్ని తెలుసుకునే సమయం వచ్చిందని.. ప్రేమికుల దినోత్సవం రోజున నిజమైన ప్రేమను చూస్తారంటూ ముప్పై సెకన్ల వీడియోను విడుదల చేశారు.

ఇందులో ప్రభాస్ ఓ ప్రేమికుడిగా యంగ్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. పీరియాడికల్‌ లవ్‌ స్టోరీగా యు.వి.కృష్ణంరాజు సమర్పణలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి, సాషా ఛత్రీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ, మలయాళీ, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్యగా కనిపించనున్నారు.


30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus