Prabhas: ప్రభాస్ ఐడియా వల్ల అంతా మారిపోయిందా?

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ మరో 72 గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో టికెట్లు బుకింగ్ అవుతున్నాయి. హైదరాబాద్ లో ఈ సినిమాకు తొలిరోజు టికెట్లు దొరకడం కష్టమవుతోంది. బుక్ మై షోలో కొన్ని నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడవుతూ ఉండటంతో కలెక్షన్ల విషయంలో రాధేశ్యామ్ కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం రాధేశ్యామ్ రిలీజ్ సమయానికి టికెట్ రేట్లు పెరుగుతాయని ఆశిస్తున్నారు.

అందువల్లే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ను ఇంకా మొదలుపెట్టలేదు. అయితే ఈ సినిమా కోసం ఏకంగా 101 సెట్లు వేశారని సమాచారం. సాధారణంగా పెద్ద సినిమాలకు 20 నుంచి 30 సెట్లు వేయడం జరుగుతుంది. అయితే రాధేశ్యామ్ కోసం ఇటలీనే హైదరాబాద్ కు తీసుకొనిరావాల్సిన పరిస్థితి ఉండటంతో ఇన్ని సెట్లు వేయాల్సి వచ్చిందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం వరకు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కొంతమేర నెగిటివిటీ ఉండగా ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు, మేకింగ్ వీడియో ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తున్నారు.

ఐదు భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా భారీ స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను సాధించాల్సి ఉంది. ప్రభాస్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఈ సినిమా ఒకటిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాధేశ్యామ్ కు సెన్సార్ టాక్, ఉమైర్ సంధు రివ్యూ పాజిటివ్ గా ఉండటంతో అభిమానులు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందని నమ్ముతున్నారు. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

జిల్ తర్వాత రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఇదే కావడం గమనార్హం. దాదాపుగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ కు ఇటలీని తలపించేలా సెట్స్ వేయాలని ప్రభాస్ ఐడియా ఇచ్చారని సమాచారం.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus