జనవరి 14న విడుదల తేదీ అని ప్రకటించినప్పుడు…ప్రమోషన్ల హడావిడి ఓ రేంజ్లో చేసారు ‘రాధేశ్యామ్’ టీం. ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించేసారు. కానీ అనుకోకుండా రిలీజ్ డేట్ మారడంతో అంతా కామ్ అయిపోయారు. పోనీలే అనుకుని అభిమానులు సరిపెట్టుకున్నారు.. కానీ ఇప్పుడు రిలీజ్ సరిగ్గా 10 రోజులు మాత్రమే సమయం ఉంది.కానీ ప్రమోషన్ల జాడే లేదు. ఇది ఒక్క తెలుగులో మాత్రమే రిలీజ్ అయ్యే సినిమా కాదు..
పాన్ ఇండియా లెవెల్లో విడుదల భారీ లెవెల్లో విడుదల కాబోతున్న సినిమా. బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా భారీగా ఉంది. ఎంత కాదనుకున్నా ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ రూ.250 కోట్ల వరకు జరగొచ్చనేది అంచనా. అది సాదా సీదా టార్గెట్ కాదు. హిట్ టాక్ వచ్చినా, ముందు నుండీ భారీగా ప్రమోట్ చేస్తేనే అది సాధ్యమవుతుంది. లేదంటే కష్టమే. రాధే శ్యామ్ కు రెండు వారాల ముందు భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి ఉంటుంది.
ఇది మాస్ మూవీ. ‘రాధే శ్యామ్’ థియేటర్లకు వచ్చినా ఇది లాంగ్ రన్ పడితే అదో ఇబ్బంది అయితే… ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయిన రెండు వారాలకి ‘ఆర్.ఆర్.ఆర్’ రిలీజ్ కాబోతుంది. దాని పక్కన ఏ సినిమా కూడా పెర్ఫార్మ్ చేసే అవకాశం ఉండదు. అప్పుడు రాధే శ్యామ్ కు మరింత మైనస్ అవుతుంది. అప్పుడు ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. సినిమాకి ఎంత భారీగా ప్రమోషన్లు చేస్తే అంత మంచిది. ఏదో వదిలించుకోవడానికి రిలీజ్ చేసినట్టు చేస్తే మాత్రం బయ్యర్స్ భారీగా నష్టపోవడం ఖాయం.
Most Recommended Video
‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!