ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న చిత్రం ‘రాధే శ్యామ్’. నిజానికి ‘ఆర్.ఆర్.ఆర్’ మొదలైనప్పుడే ఈ చిత్రం షూటింగ్ కూడా మొదలయ్యింది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. కరోనా కారణంగా మరో రెండేళ్ళు వాయిదా పడింది ‘రాధే శ్యామ్’. నిజానికి జనవరి 14న సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అనుకున్నారు కానీ కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ పడడం పక్క రాష్ట్రాల్లో పలు చోట్ల థియేటర్లు మూతపడడం, ఆంద్రప్రదేశ్ లో టికెట్ రేట్ల ఇష్యు నడుస్తుండడం వంటి కారణాల వల్ల సంక్రాంతికి ‘రాధే శ్యామ్’ రాలేదు.
అయితే కొత్త విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ చిత్రానికి ఓటిటి నుండీ రూ.350 కోట్ల భారీ ఆఫర్ వచ్చినప్పటికీ నిర్మాతలు థియేట్రికల్ రిలీజ్ కే మక్కువ చూపిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఎట్టకేలకు ‘రాధే శ్యామ్’ విడుదల తేదీ ఫిక్స్ అయ్యింది. మార్చి 4న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న `ఆర్.ఆర్.ఆర్` రాబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.
కాబట్టి ఆ చిత్రానికంటే రెండు వారాల ముందే రాధే శ్యామ్ వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఫిబ్రవరిలో… కోవిడ్ కేసుల తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.టికెట్ రేట్ల ఇష్యు కూడా ఓ కొలిక్కి రావచ్చు. నైట్ కర్‌ఫ్యూ వంటివి కూడా తీసేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి.. ‘రాధే శ్యామ్’ విడుదలకి ఇబ్బంది ఉండకపోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు ఓ పెద్ద సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి.. ‘రాధే శ్యామ్’ కు భారీ ఓపెనింగ్స్ నమోదయ్యే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.
Most Recommended Video
అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!