Radhe Shyam Songs: సాంగ్ టీజర్ తో అంచనాలు పెంచేసిన ప్రభాస్!

స్టార్ హీరో ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ మూవీ 2022 సంవత్సరం జనవరి 14వ తేదీన రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఈ రాతలే పాట సినిమాపై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా రాధేశ్యామ్ నుంచి “ఆషికి ఆగయి” అనే సాంగ్ టీజర్ రిలీజైంది. హిందీ వెర్షన్ టీజర్ ను ఈరోజు మధ్యాహ్నం మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ టీజర్ లో సముద్రతీరాన అందమైన విజువల్స్ తో పాటు ప్రభాస్, పూజా హెగ్డే మధ్య ఉన్న గాఢమైన ప్రేమను చూపించారు.

కళ్లు చెదిరే విజువల్స్ తో రాధేశ్యామ్ మూవీ తెరకెక్కుతోందని రాధేశ్యామ్ సాంగ్ టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ప్రభాస్, పూజా హెగ్డే ఈ సాంగ్ టీజర్ లో స్టైలిష్ లుక్స్ లో ఆకట్టుకున్నారు. డిసెంబర్ 1వ తేదీన సెకండ్ సింగిల్ ఫుల్ సాంగ్ అన్ని భాషల్లో రిలీజ్ కానుంది. హిందీలో ఈ పాటను మిథున్ కంపోజ్ చేయగా ఆర్జిత్ సింగ్, మిథున్ పాడారు. ఈ సాంగ్ తెలుగు వెర్షన్ ను సిధ్ శ్రీరామ్ పాడారని తెలుస్తోంది.

ఈరోజు రాత్రి 7 గంటలకు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఈ సాంగ్ టీజర్ రిలీజ్ కానుంది. ప్రభాస్ ఈ సినిమాలో లవర్ బాయ్ గా కనిపిస్తుండటంతో ప్రభాస్ లేడీ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్, గోపికృష్ణా మూవీస్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి రికార్డు స్థాయిలో థియేటర్లలో విడుదల కానుందని సమాచారం.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!


టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus