సినిమాకు రీషూట్లు పెద్ద విషయమేమీ కాదు. ఈ రోజుల్లో సినిమా మరో ఐదారు రోజుల్లో రిలీజ్ అన్నా… ప్యాచ్ వర్క్‌ల పేరిట రీషూట్లు చాలానే చేస్తున్నారు. ఇక ముందుగా అనుకున్న, వాయించిన సంగీతం బాగోలేకపోతే రిలీజ్‌కు ముందు వేరేవాళ్లను తీసుకొచ్చి బ్యాగ్రౌండ్ స్కోర్ మారుస్తున్నారు. అయితే ఎప్పుడో సినిమా రెడీ అయిపోయి… రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న సినిమాకు ఇప్పుడు మళ్లీ రీ రికార్డింగ్ అంటే ఓవర్ అనిపించడం లేదు… కచ్చితంగా అనిపిస్తుంది.
మేం పైన చెప్పిందంతా ఏ సినిమా కోసమో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంట. ఇటీవల ఆ సినిమా టీమ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం ఇచ్చిన అనౌన్స్‌మెంట్ చూసే ఉంటారు. అదేనండి ‘రాధే శ్యామ్’ గురించి. కరోనా ఫస్ట్ వేవ్‌కు ముందే ఈ సినిమా రెడీ అయిపోయింది. ఈ విషయం మనం కాదు సినిమా టీమే చెబుతోంది. అయితే ఆ తర్వాత చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వచ్చారు. ఇంకా అంతా రెడీ రేపో మాపో రిలీజ్ అనగానే సెకండ్ వేవ్ వచ్చింది. మళ్లీ ఆపేశారు.
ఇప్పుడు అన్నీ సమస్యలు తీరాయి… (ఒక్ ఏపీలో టికెట్ల సమస్య తప్ప) అనుకుంటే ఇప్పుడు మళ్లీ రీ రికార్డింగ్ అంటున్నారు. జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన నేపథ్య సంగీతం నప్పలేదు అనుకున్నారో ఇంకేం అనుకున్నారో కానీ… ఇప్పుడు తమన్‌ను తీసుకొచ్చారు. గట్టిగా చూస్తే సినిమా విడుదలకు 20 రోజులు ఉంది. ఈ సమయంలో రీరికార్డింగ్ మళ్లీ షురూ అని చెప్పుకొచ్చారు. నిజానికి ఈ విషయంలో చాలా రోజుల క్రితమే లీక్ అయ్యింది. ఇప్పుడు అఫీషియల్ అయ్యింది.
మరో సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని కూడా అంటున్నారు. సినిమా కోసం 12 దేశాల్లో ఈ పనులు జరుగుతున్నాయని, చివర దశకొచ్చాయని చిత్రబృందం అంటోంది. ఇంకా సినిమాలకు చిత్రిక పట్టడం కరెక్టేనా అంటే కాదనే చెప్పొచ్చు. ‘పుష్ప’ లాంటి సినిమా విషయంలో అంటే వాళ్లు ఈ మధ్యే సినిమా పూర్తి చేశారు. ‘రాధే శ్యామ్’ ఎప్పుడో సిద్ధమైపోయింది. అయితే తమన్ చేసే సంగీతం కేవలం దక్షిణాది వరకేనట. అదేంటో మరి.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!