అలా అయితే ‘రాధే శ్యామ్’ టీజర్ కూడా ఊహించని రికార్డులు కొట్టబోతున్నట్టే..!

ఇటీవల విడుదలైన ‘కె.జి.ఎఫ్2’ టీజర్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ‘కె.జి.ఎఫ్ చాప్టర్1’ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా బిజినెస్ జరుగుతుంది. ఇలాంటి తరుణంలో విడుదలైన ‘కె.జి.ఎఫ్2’ టీజర్.. యూట్యూబ్ లో ఏకంగా 165 మిలియన్ల పైనే వ్యూస్ ను నమోదుచేసింది. సినిమా పై అంచనాలు కూడా భారీగానే పెంచేసిందని చెప్పాలి. అయితే ‘కె.జి.ఎఫ్2’ చిత్రానికి కన్నడతో తెలుగు,హిందీ,మలయాళం, తమిళ్ భాషల్లో ఎంత క్రేజ్ ను సంపాదించుకున్నప్పటికీ..

అన్ని భాషలకు కలిపి ఒక టీజర్ ను విడుదల చేశారు. దాంతో రికార్డుల మోత మోగినట్టు స్పష్టమవుతుంది. సరిగ్గా ఇప్పుడు అదే టెక్నిక్ ను ‘రాధే శ్యామ్’ యూనిట్ ఫాలో అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం కూడా పాన్ ఇండియన్ మూవీగానే రూపొందుతోంది. ఇక ఈ చిత్రం టీజర్ ను వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేయబోతున్నట్టు దర్శకనిర్మాతలు ప్రకటించారు. అయితే టీజర్ గా విడుదల చేసినా..

చిన్న గ్లింప్స్ గా విడుదల చేసినా… అన్ని భాషల ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఒక్కటే విడుదల చేస్తారట. అలా అయితే యూట్యూబ్ లో ‘కె.జి.ఎఫ్2’ టీజర్ లానే ‘రాధే శ్యామ్’ టీజర్ కూడా రికార్డులు కొట్టడం ఖాయమని తెలుస్తుంది. ఇక పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి రాధాకృష్ణ కుమార్ దర్శకుడు కావడం విశేషం.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus