Prabhas: రాధేశ్యామ్ ట్రైలర్ 2 డేట్ ఫిక్స్!

టాలీవుడ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ పెంచుకుంటున్న ప్రభాస్ రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కూడా బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడు అని అనిపిస్తోంది. హాలీవుడ్ లో కూడా ప్రభాస్ సినిమాలు ఒక సరికొత్త ఒరవడిని సృష్టించే అవకాశం ఉంది అని ఇప్పటికే చాలా మంది సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టు Kను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

Click Here To Watch

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం ఐదు వందల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే రాధేశ్యాన్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరొక ట్రైలర్ ను కూడా త్వరలోనే విడుదల చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. యు.వి.క్రియేషన్స్ లో రాధా కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు.

భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించి అందులో ఒక అందమైన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇక అనుకోకుండా కరీనా కారణంగా సినిమా వాయిదా పడడంతో మరొకసారి ఈ సినిమాకు పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యేలా చేయాలి అని ఆలోచిస్తున్నారు. అందుకోసం కూడా మరొక ట్రైలర్ ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు రాధాకృష్ణ ఇప్పటికే సెకండ్ ట్రైలర్ కు సంబంధించిన పనులను కూడా పూర్తి చేసినట్లు సమాచారం.

ఇక ఆ ట్రైలర్ ను మార్చి 2వ తేదీన విడుదల చేస్తారు అని టాక్ వస్తుంది. ఇక సినిమాను వరల్డ్ వైడ్ గా మార్చి 11వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ అదే డేట్ ను మిస్ చేసుకోకూడదు అని కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు ఈజీగా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుంది అని అనుకుంటున్నారు. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus