Radhe Shyam: రాధేశ్యామ్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

టాప్ పాన్ ఇండియన్ స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనుకుంటున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సంక్రాంతికి రాధేశ్యామ్ తో వస్తాడా రాడా అనే విషయంలో అనేక రకాల అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటికే RRR సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లు దాదాపు క్లారిటీ వచ్చేసింది. RRR వాయిదా పడటంతో పొంగల్ లోకి మళ్ళీ భీమ్లా నాయక్ ప్రవేశించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే రాధే శ్యామ్ పరిస్థితి ఏమిటి అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు అనుకుంటున్న సమయంలో దర్శకుడు అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు.

రాధేశ్యామ్ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ సమయంలో దర్శకుడు రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలుపుతూ సంక్రాంతికి రాబోతున్నట్లు చెప్పకనే చెప్పేశాడు. ‘రాధే శ్యామ్ నుండి లవ్ & డెస్టినీ మధ్య జరిగే అతిపెద్ద యుద్ధానికి ఈ పొంగల్ సాక్షిగా చూద్దాం..’ అంటూ దర్శకుడు రాధాకృష్ణ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ అందించాడు. ఈ ఒక్క ట్వీట్ తో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది.

తప్పకుండా సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీన విడుదల కాబోతుంది అర్థమైంది. ఇక RRR సినిమా మాత్రం ఇప్పట్లో వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఢిల్లీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు లాంటి అతి ముఖ్యమైన ప్రాంతాల్లో చాలావరకు సినిమా థియేటర్స్ మూత పడబోతున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల్లో కేవలం 50% ఆక్యుపెన్స్ తో మాత్రమే కొనసాగనున్నాయి. ఇక ఈ సమయంలో పాన్ ఇండియా సినిమాలు విడుదల చేయడం అంత సురక్షితం కాదు అని చాలా మంది చర్చించుకుంటున్నారు.

ఇక ముందు జాగ్రత్తగా త్రిబుల్ ఆర్ సినిమా వాయిదా వేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రాధే శ్యామ్ మాత్రం బిజినెస్ కు తగ్గట్టుగా సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక భీమ్లా నాయక్ తో పాటు సంక్రాంతి బరిలో బంగార్రాజు కూడా రాబోతున్నాడు.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus