Radhika Apte: డబ్బులు కోసమే ఆ సినిమాల్లో నటించా.. రాధిక ఆప్టే వైరల్‌ వ్యాఖ్యలు

ఇక్కడ టాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నన్ని ఏళ్లు చేసేసి, అనుకున్న రెమ్యూనరేషన్‌, కుదిరితే స్టార్ స్టేటస్‌ ఎంజాయ్‌ చేసి.. ఆ తర్వాత బాలీవుడ్‌కి ఎప్పటిలా వెళ్లిపోయే హీరోయిన్లను మీరు చూసుంటారు. అలా వెళ్లిన తర్వాత సౌత్ సినిమాల మీద, తెలుగు సినిమాల మీద విపరీతమైన కామెంట్లు చేసిన హీరోయిన్లను తక్కువగా చూసుంటారు. ఈ లిస్ట్‌లోకి రాధికా ఆప్టే కూడా చేరింది. సౌత్‌లో ఆమె సుమారు 10 సినిమాల్లో నటించింది. వీలైనంతగా అలరించడానికి ట్రై చేసింది. అయితే సరైన విజయాలు అయితే అందుకోలేకపోయింది.

Radhika Apte

అయితే, ఇప్పుడు ఆమె ఆరేళ్లుగా సౌత్‌లో సినిమాలు చేయడం లేదు. చేయకపోతే చేయకపోని.. ఇక్కడి వాళ్ల మీద విపరీత కామెంట్లు చేస్తోంది. గతంలో ఓసారి ఇలా మాట్లాడిన రాధిక.. ఇప్పుడు మరోసారి అలాంటి కామెంట్లే చేసింది. ఆమె సినిమా పరిశ్రమకు వచ్చి 20 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో వివిధ విషయాలను షేర్‌ చేసుకుంది. ఈ క్రమంలో సౌత్‌ సినిమాల్లో నటించినప్పుడు ఎదుర్కొన్న ఇబ్బందులు, లైంగిక వివక్ష గురించి మాట్లాడింది. అందులో కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి.

అలా అని బాలీవుడ్ గురించి ఏమీ అనలేదని కాదు. అక్కడి పరిస్థితుల గురించి కూడా చెప్పింది. బాలీవుడ్‌లో తనకు కొన్ని ఆఫర్లు వచ్చాయని, ఆ సినిమాల గురించి మాట్లాడటానికి వెళ్లి వారితో మాట్లాడిన తర్వాత ఇకపై జీవితంలో వాళ్లను కలవకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. వారంతా ఇండస్ట్రీలో పేరున్న వ్యక్తులని, కానీ, నిజస్వరూపాలు అలా ఉంటాయని కలిసి మాట్లాడిన వరకు తెలియలేదు అని చెప్పింది. వాళ్ల పేర్లు చెబితే అందరూ ఆశ్చర్యపోతారు అని కూడా అంది..

ఇక సౌత్‌ సినిమాల గురించి మాట్లాడుతూ.. ఒకప్పుడు ఆర్థిక పరిస్థితుల కారణంగా సౌత్‌ సినిమాలు చేశాను. అక్కడ సవాళ్లు ఎదుర్కొన్నాను. కొన్నిసార్లు సెట్స్‌లో భయంకరమైన అనుభవాలు కలిగాయి. సెట్‌ మొత్తంలో నేను ఒక్కదాన్నే మహిళను ఉండేదాన్ని. మారుమూల పట్టణాల్లో షూటింగ్‌ చేసేవారు. నా స్టాఫ్‌కి కూడా అనుమతి లేదని చెప్పారు. అప్పట్లో సెట్‌లో మహిళల గురించి అసభ్యకరమైన జోకులు వేసేవారు. దాంతో అసౌకర్యంగా ఉండేది అని చెప్పింది రాధిక.

రాధిక సౌత్‌లో నటించిన సినిమాలు చూస్తే వాటిలో మారుమూల పట్టణాల్లో జరిగిన సినిమాలేంటో మీరే చెప్పేయొచ్చు. తమిళంలో ‘ధోనీ’, ‘ఆల్‌ ఇన్‌ ఆల్‌ అలగు రాజా’, ‘వెట్రి సెల్వన్‌’, ‘కబాలి’, ‘చితిరం పేసుతాది 2’లో నటించింది. ఇక తెలుగులో ‘రక్త చరిత్ర’, ‘రక్త చరిత్ర 2’, ‘లెజెండ్‌’, ‘లయన్‌’.

రెమ్యూనరేషన్‌.. మాస్‌ మహారాజ.. రెండూ వద్దన్న రవితేజ.. ఏమైంది?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus