Radhika Apte: నా స్టాఫ్ అంతా నా ఇంటిమేట్ సీన్లు చూశారు.. చాలా భయం వేసింది
- September 24, 2026 / 05:19 PM ISTByPhani Kumar
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో ‘రక్తచరిత్ర’ ‘లెజెండ్’ ‘లయన్’ వంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ఓటీటీ పరంగా ఈమెకు మంచి మార్కెట్ ఉంది. దానిని ఎప్పటికప్పుడు క్యాష్ చేసుకుంటూ పలు వెబ్ సిరీస్, ఓటీటీ సినిమాల్లో నటిస్తూ వస్తోంది ఈ బ్యూటీ. ఇటీవల వచ్చిన ‘లస్ట్ స్టోరీస్ 3’లో కూడా ఈమె ఓ ముఖ్య పాత్ర పోషించింది.
Radhika Apte

ఈ సిరీస్లో భాగంగా ఆమె కొన్ని ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించాల్సి వచ్చింది. అవి వీరి రియల్ లైఫ్ ఎలాంటి నష్టాలను తీసుకొస్తాయి అనే విషయంపై రాధికా ఆప్టే స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఈ సందర్భంగా వాటి వల్ల గతంలో ఆమె ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను కూడా గుర్తుచేసుకుంది. రాధికా ఆప్టే మాట్లాడుతూ..” గతంలో నేను ఒక చిత్రంలో నటించాను. అందులోని కొన్ని ప్రైవేట్ సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
అవి ఇంటిమేట్ సన్నివేశాలు. జనాలు వాటిని సోషల్ మీడియాలో తెగ చూసి నా గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసేవారు. దీంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. భయంతో నాలుగు రోజుల పాటు ఇంటి నుండీ కాలు బయటపెట్టలేదు.నేను ఒంటరిగా అపార్ట్‌మెంట్‌లో ఉండటాన్ని గమనించి, ఎవరైనా అపరిచితులు వచ్చి నన్ను ఇబ్బంది పెడతారేమో అనే ఆందోళన నన్ను కలచివేసింది. నా చుట్టుపక్కల ఉండే వాచ్‌మెన్, స్టైలిస్ట్, కారు డ్రైవర్ సైతం ఆ వీడియోనే చూస్తున్నారనే విషయం తెలిసి నాకు ఇంకా భయం చేసింది.
అయితే ధైర్యం చేసుకుని వారిని పిలచి.. “మీరు నాకు అండగా ఉంటారా? లేక జీతం తీసుకుని వెళ్ళిపోతారా?” అని అడిగేశాను..! అందుకు వారు ‘నాకు అండగా ఉంటామని” చెప్పి నాలో ధైర్యాన్ని నింపారు.











