Radhika Sarathkumar: వైరల్ అవుతున్న రాధికా శరత్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ నటీమణులలో రాధికా శరత్ కుమార్ ఒకరు కాగా ఈ నటికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. వయస్సుకు అనుగుణంగా పాత్రలను ఎంచుకుంటూ రాధిక సత్తా చాటుతున్నారు. అమ్మ పాత్రల్లో, ఇతర కీలక పాత్రల్లో రాధిక ఎక్కువగా నటిస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా రాధికకు చెప్పుకోదగ్గ పాత్రలు వస్తున్నాయి. ఎలాంటి రోల్ ఇచ్చినా ఆ రోల్ కు రాధిక పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారు. ఆపరేషన్ రావణ్ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.

రక్షిత్ అట్లూరి ఈ సినిమాలో హీరోగా నటించారు. లండన్ బాబులు, పలాస సినిమాల తర్వాత రక్షిత్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి. మర్డర్ మిస్టరీలను చేధించే పాత్రలో ఈ నటుడు నటించడం గమనార్హం. ఈ సినిమా సైకో థ్రిల్లర్ తరహా కథాంశంతో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది. ఈ సినిమాతో సంగీర్తన టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానుండగా ఈ నటి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన రాధిక (Radhika Sarathkumar) ఈ సినిమా టీజర్ ఈవెంట్ లో మాట్లాడుతూ హీరో రక్షిత్ గోల్డెన్ స్పూన్ తో కాదు గోల్డెన్ ప్లేట్ తో పుట్టాడని తెలిపారు. కథ నచ్చడంతో ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని రక్షిత్ నటించిన పలాస మూవీ తనకు నచ్చిందని రాధిక పేర్కొన్నారు. కష్టపడితే మంచి ఫలితం కచ్చితంగా దక్కుతుందని ఈ సినిమా కోసం రక్షిత్ కష్టపడ్డాడని రాధిక చెప్పుకొచ్చారు.

నా లైఫ్ లో ఎగుడుదిగుడులు ఉన్నాయని సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉన్నాయని ఆమె కామెంట్లు చేశారు. నేను ఫెయిల్యూర్ ను ఒప్పుకోలేదని కష్టాన్ని నమ్ముకున్నానని అందువల్లే మంచి ఫలితాలు దక్కాయని ఆమె కామెంట్లు చేశారు. రాధిక వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus