Lawrence: 150 మంది చిన్నారుల దత్తత… ఉదారత చాటుకున్న లారెన్స్‌!

  • April 12, 2023 / 03:53 PM IST

డ్యాన్సర్‌గా, డ్యాన్స్‌ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా.. ఇలా వివిధ రంగాల్లో తనదైన ముద్ర వేస్తున్న లారెన్స్‌.. దాతృత్వంలోనూ అదే స్థాయిలో తన ముద్ర చూపిస్తున్నారు. ఆయన నుండి సాయం పొందినవాళ్లు అప్పుడప్పుడు ఆయన గురించి చెబుతుంటే ఆయన గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. తాజాగా ఆయన చేసిన మరో దాతృత్వ కార్యక్రమం ఎందరినో మెప్పించింది. అలాగే లారెన్స్‌ అంటే ఇదీ అంటూ ఆయన అభిమానులు, నెటిజన్లు మెచ్చుకునేలా చేసింది. సామాజిక కార్యక్రమాల్లో రాఘవ లారెన్స్‌ ముందుంటారనే విషయం తెలిసిందే.

లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా చిన్నారులకు సాయం చేస్తున్న ఆయన ఇప్పుడు 150 మందిని దత్తత తీసుకున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ చిన్నారులకు నాణ్యమైన విద్య అందించేలా కృషి చేస్తానని లారెన్స్‌ చెప్పారు. ఈ క్రమంలో ప్రేక్షకులు, అభిమానుల ఆశీస్సులు తనకు కావాలని లారెన్స్‌ కోరారు. కొత్త సినిమా ‘రుద్రన్’ / ‘రుద్రుడు’ ఆడియో విడుదల కార్యక్రమంలో భాగంగా ఆ చిన్నారులతో కలసి దిగిన ఫొటోను లారెన్స్‌ ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

ఇదిలా ఉండగా లారెన్స్‌ (Lawrence) గతంలో.. గుండె సమస్య ఉన్న దాదాపు 141 మంది చిన్నారులకు శస్త్ర చికిత్స చేయించారు. కేవలం తమిళనాడులోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయన ఈ మంచి పనులు చేస్తున్నారు. ఆర్థిక సమస్య కారణంగా చదువుకు దూరమైన వాళ్లకు, హార్ట్‌ సర్జరీ అవసరం ఏర్పడినా లారెన్స్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ను సంప్రదించాలని ఆయన కోరారు. సేవ చేసే విషయంలో రాఘవేంద్ర స్వామి తనను ముందుకు నడిపిస్తున్నారని లారెనస్‌ చెప్పారు.

తెరపై హీరోగా కాదు… నిజ జీవితంలో హీరోగా ఉండాలన్న తన తల్లి చెప్పిన మాటను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ మేరకు చెప్పుకొచ్చారు. కతిరేశన్‌ దర్శకత్వంలో రూపొందిన ‘రుద్రన్‌’ / ‘రుద్రుడు’ ఈ నెల 14న విడుదలకానుంది. మరోవైపు లారెన్స్‌ ‘చంద్రముఖి 2’ సినిమాలోనూ నటిస్తున్నారు. వాసు దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ కీలక పాత్రధారి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus