2005 లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. రజినీకాంత్, నయనతార జంటగా నటించిన ఈ మూవీలో ప్రభు, జ్యోతిక, వినీత్ లు కీలక పాత్రలు పోషించారు. హర్రర్ టచ్ ఉన్న కామెడీ సినిమా ఇది. అలాగే ఎమోషన్స్ కూడా బాగా పండాయి. అన్నిటికీ మించి ఈ సినిమాలో రజినీకాంత్ ను చాలా కొత్తగా చూపించాడు దర్శకుడు. క్లైమాక్స్ కూడా సూపర్ అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత దర్శకుడు పి.వాసు కి తెలుగులో కూడా ఆఫర్లు వచ్చాయి.
బాలకృష్ణతో ‘మహారథి’ , నాగార్జునతో- విష్ణు లతో ‘కృష్ణార్జున’ వంటి సినిమాలు చేశాడు. అవి ఫ్లాప్ అయ్యాయి. అయినప్పటికీ ‘నాగవల్లి’ ని ‘చంద్రముఖి’ సీక్వెల్ గా తీస్తాను అంటే వెంకీ ఛాన్స్ ఇచ్చాడు. కానీ అది పెద్దగా ఆడలేదు. ఇన్నేళ్లకి మళ్ళీ ‘చంద్రముఖి 2’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికంటే ‘నాగవల్లి’ అనే బాగుంది అనిపించేలా ఉంటుంది ‘చంద్రముఖి’.
ఇక తన నెక్స్ట్ సినిమా ‘జిగర్తాండ’ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కి వచ్చిన లారెన్స్ కి ‘చంద్రముఖి 2’ రిజల్ట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి అతను బదులిస్తూ.. ” ‘చంద్రముఖి 2’ డిఫెరెంట్ గా ఉంటుంది అని ప్రయత్నించాను. నేను ఎన్నో కష్టాలు పడితే ఈ స్టేజికి వచ్చాను.
అప్పుడు హిట్ ఏంటి.. ప్లాప్ ఏంటి.. ఏదైనా ఛాన్స్ వస్తే చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని నేను భావిస్తాను’ అంటూ లారెన్స్ చెప్పుకొచ్చాడు. అటు తర్వాత ‘ ‘చంద్రముఖి 2′ లో హర్రర్ ఎలిమెంట్స్ లేకుండా స్క్రిప్ట్ ఎలా ఓకే చేశారు’ అనే ప్రశ్న ఎదురైంది. దానికి (Raghava Lawrence) లారెన్స్ ‘ అది డైరెక్టర్ పి.వాసు గారిని అడగండి’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు