ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ లారెన్స్ … అటు తర్వాత నటుడుగా కూడా మారి ‘స్పీడ్ డాన్సర్’ వంటి సినిమాల్లో నటించాడు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఇతనికి నాగార్జున డైరెక్టర్ ఛాన్స్ ఇప్పించాడు. ‘మాస్’ తో లారెన్స్ కు మంచి లైఫ్ ఇచ్చాడు నాగ్. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అటు తర్వాత వచ్చిన ‘స్టైల్’ కూడా సక్సెస్ అందుకుంది. ఇక ‘ముని’, ‘కాంచన'(ముని 2), ‘గంగ'(కాంచన2, ముని3), ‘కాంచన3’ వంటి సినిమాలతో హిట్లు కొట్టి మినిమమ్ గ్యారంటీ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు.
‘డాన్’ ‘రెబల్’ చిత్రాలు నిరాశపరిచినా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇతని సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ లారెన్స్ సినిమా అంటే ఎగబడి చూస్తారు. అందుకేనేమో ఇతని లేటెస్ట్ మూవీ ‘రుద్రుడు’ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కతిరేషన్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించగా ఏప్రిల్ 14న ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది.
ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని ట్రేడ్ పండితుల సమాచారం. ఈ మధ్య కాలంలో సూర్య, కార్తీ సినిమాలకు కూడా అంత బిజినెస్ జరగడం లేదు. పోనీ లారెన్స్ సినిమా ఏడాదికి ఒక్కటి కూడా రాదు. అయినా సరే ఈ రేంజ్ లో ‘రుద్రుడు’ చిత్రానికి థియేట్రికల్ బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు.
ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!
స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!