‘లక్ష్యం’ (Lakshyam) తో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు శ్రీవాస్ (Sriwass Oleti) . ఆ తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’ (Rama Rama Krishna Krishna) అనే కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన ఫ్యామిలీ సినిమా చేశాడు. అది బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత మంచు ఫ్యామిలీతో ‘పాండవులు పాండవులు తుమ్మెద’ (Pandavulu Pandavulu Tummeda) చేశాడు. అది కూడా వర్కౌట్ కాలేదు. మళ్ళీ గోపీచంద్ (Gopichand) ‘లౌక్యం’ తో (Loukyam) ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. అది పెద్ద హిట్ అయ్యింది. బాలయ్య బాబు (Nandamuri Balakrishna) పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చేలా చేసింది.
అయితే ‘డిక్టేటర్’ తో (Dictator) అతను బాలయ్యకి ప్లాప్ ఇచ్చాడు. అటు తర్వాత చేసిన ‘సాక్ష్యం’ (Saakshyam) ‘రామబాణం’ (Ramabanam) సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు ఫ్లాప్ అయ్యాయి. ప్రస్తుతం ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ తప్ప దర్శకుడు శ్రీవాస్ ని.. ఏ నిర్మాణ సంస్థ కూడా నమ్మడం లేదు. హీరోలు కూడా అంతే..! తెలుగు హీరోలు ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఇప్పుడు లారెన్స్ తో ఓ సినిమా సెట్ చేసుకునే పనిలో పడ్డాడు శ్రీవాస్. లారెన్స్ (Raghava Lawrence) కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది.
ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో అతని సినిమాలకి మంచి ఓపెనింగ్స్ వస్తాయి. అందుకే శ్రీవాస్ అతన్ని పట్టుకుని తెలుగు, తమిళ భాషల్లో ఓ ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆల్రెడీ స్టోరీ సిట్టింగ్స్ వేయడం జరిగింది. ఇది కంప్లీట్ మాస్ అండ్ యాక్షన్ మూవీ కథ అని వినికిడి. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.