Puneeth Rajkumar: పునీత్ నా జీవితాన్ని నిలబెట్టి అందరికీ అందనంత దూరం వెళ్లారు!

కన్నడ పవర్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త ఇప్పటికి అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడిగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిగా ఎన్నో అనాధాశ్రమాలు వృద్ధాశ్రమాలు గోశాలలు పాఠశాలలో నిర్మించి ఎంతో మంచి మనసు చాటుకున్నారు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి ఆకస్మికంగా మరణించడంతో ఇప్పటికీ ఈ మరణ వార్త నుంచి అభిమానులు బయటపడలేకపోతున్నారు.

ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ అంటే తన కుటుంబ సభ్యులకు ఎంత ప్రేమో మనకు తెలిసిందే. వీరి కుటుంబ సభ్యులు ఏ కార్యక్రమంలో పాల్గొన్న పునీత్ విషయం ప్రస్తావనకు వచ్చిన వేదిక పైన ఎన్నోసార్లు ఎమోషనల్ అవ్వడం మనం చూసాము. ఇలా కుటుంబ సభ్యులందరికీ ఒకే రకమైనటువంటి ప్రేమను పంచే పునీత్ లేరనే వార్త కుటుంబ సభ్యులను ఎంతగానో కృంగదీస్తుంది. ఇక పునీత్ పెద్దన్నయ్య శివరాజ్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. ఇక రెండవ అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ సినిమాలలో తక్కువగా నటించిన ఈయన అందరికీ ఎంతో సుపరిచితమే.

తాజాగా రాఘవేంద్ర రాజ్ కుమార్ తన తమ్ముడు (Puneeth Rajkumar) పునీత్ రాజ్ కుమార్ ని తలుచుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తనకు తమ్ముడే అయినప్పటికీ వయసులో నాకన్నా 10 సంవత్సరాలు చిన్నవాడు కావడంతో తనని నేను ఒక కొడుకు లాగే పెంచానని తెలిపారు. అయితే నేను కష్ట సమయాలలో ఉన్నప్పుడు తను నాకు తండ్రిగా నిలబడ్డారని రాఘవేంద్ర రాజ్ కుమార్ ఎమోషనల్ అయ్యారు. సినిమా అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న నాకు సినిమా అవకాశాలు ఇప్పించారు.

నా కుటుంబ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడంతో ఆ బాధ్యతలని పునీత్ తీసుకున్నారు.నాకు సొంత ఇల్లు లేకపోతే తన ఇంటి కన్నా ఎంతో గొప్పగా నాకు ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇలా తండ్రిగా నా జీవితాన్ని నిలబెట్టి పునీత్ మాత్రం అందనంత దూరానికి వెళ్లిపోయారు అంటూ ఈ సందర్భంగా రాఘవేంద్ర రాజ్ కుమార్ తన తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ గొప్పతనం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus