ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు.. రాఘవేంద్ర రావు ఎమోషనల్!

ప్రముఖ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాఘవేంద్ర రావు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు గురించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు స్పందించి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాఘవేంద్ర రావు కూడా పేరు మార్పు గురించి స్పందించడంతో పాటు ఎమోషనల్ అయ్యారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని రాఘవేంద్ర రావు పేర్కొన్నారు. సీనియర్ ఎన్టీఆర్ పేరుతో ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చడం పట్ల తెలుగు తల్లి సిగ్గు పడుతోందని రాఘవేంద్ర రావు కామెంట్లు చేశారు. తెలుగు తల్లి కన్నీళ్లు పెడుతోందని ఆయన చెప్పుకొచ్చారు. రాఘవేంద్ర రావు ట్విట్టర్ లో చేసిన ఈ ట్వీట్ కు 11000కు పైగా లైక్స్ వచ్చాయి. రాఘవేంద్ర రావు తెలుగుదేశం పార్టీకి అనుకూలం అనే సంగతి తెలిసిందే.

రాఘవేంద్ర రావు చేసిన కామెంట్లకు నెటిజన్లు సైతం మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ జనరేషన్ ప్రేక్షకులలో ఎంతోమంది రాఘవేంద్ర రావుకు అభిమానులు అనే సంగతి తెలిసిందే. రాఘవేంద్ర రావు శిష్యులు ఎంతోమంది ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్లుగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి రాఘవేంద్ర రావు శిష్యుడనే సంగతి తెలిసిందే.

రాజమౌళి ప్రస్తుతం వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రాజమౌళి సినిమాలలో కొంతమేర రాఘవేంద్ర రావు ప్రభావం కూడా ఉంటుందనే సంగతి తెలిసిందే. రాఘవేంద్ర రావు 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus