తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా నటించిన రఘువరన్ బీటెక్ చిత్రం 2015 లో విడుదల అయింది. అప్పట్లో ఈ చిత్రం సంచలమైన విజయాన్ని సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. ఇదే చిత్రం తమిళ్లో 2014 జూలై న వేలై ఇళ్ళ పట్టదారి టైటిల్ తో విడుదల అయింది. ఈ మూవీతో తెలుగు మార్కెట్లో కూడా ధనుష్కంటూ ఒక ప్రత్యేకమైన ప్లేస్ క్రియేట్ అయింది. చిత్రాల రీ రిలీజ్ ట్రెండ్ కావడం తో ఈ సూపర్ హిట్ మూవీ ను కూడా తిరుగి రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
ఈ మూవీ (Raghuvaran B.Tech) ఆగస్టు 18న తిరిగి రీ రిలీజ్ చేశారు. ఆంధ్ర ,తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి ఈ చిత్రాన్ని ఏకంగా 100కు పైగా థియేటర్లలో విడుదల చేశారు. బుకింగ్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం ఆంధ్ర, సీడెడ్, నైజాం ఇలా ప్రతి ఏరియాలో హౌస్ ఫుల్ అయిపోయాయి. ఈ చిత్రం రీ రిలీజ్ గురించి మాట్లాడిన స్రవంతి రవి కిషోర్.. కొన్ని చిత్రాలు ఎప్పటికీ ఎవర్గ్రీన్ మూవీస్ గా మిగిలిపోతాయని. రఘువరన్ బీటెక్ కూడా అటువంటి చిత్రాలలో ఒకటి అని పేర్కొన్నారు.
ఇది ప్రతి తరంలోని విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు బాగా కనెక్ట్ అయ్యే మూవీ అని అంటున్నారు. స్టూడెంట్స్ తమ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం ,కెరియర్ స్ట్రగుల్ కోసం ఎలా ఇబ్బంది పడతారు కళ్లకు కట్టినట్టు చూపించే చిత్రం ఇది. ఎప్పుడో రిలీజ్ అయిన చిత్రానికి ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే అందరికీ ఆశ్చర్యంగానే ఉంది. ప్రస్తుతం ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరైన అనిరుద్ కెరియర్ స్టార్టింగ్ లో చేసిన మూవీస్ లో ఇది ఒకటి.
ఎక్స్ట్రార్డినరీ మ్యూజిక్ తో తెలుగులో రీ రికార్డింగ్ లో కూడా అనిరుద్ అందుకున్న ఫస్ట్ హిట్ ఈ చిత్రంతోటే. ఈ మూవీలో అమలా పాల్ హీరోయిన్ గా నటించారు. తల్లి సెంటిమెంట్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. ఇలా ఈ మూవీ ఇప్పుడు రీ రిలీజ్ లో కూడా కొత్తగా రికార్డుకు తెరలేపింది.