Brahmamudi September 23rd: సక్సెస్ అయిన రాహుల్ ప్లాన్… కృష్ణమూర్తి ఫ్యామిలీకి రాజ్ అండగా నిలుస్తారా?

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మ ముడి సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే… కృష్ణమూర్తి విగ్రహాలను చూస్తూ సంబరపడుతూ ఉంటారు. ఇక రాహుల్ రౌడీలకు ఫోన్ చేసి పని ఎంతవరకు అయింది అనడంతో ఇక్కడ ఒక ముసలోడు తిరుగుతూనే ఉన్నాడు వాడు పడుకోవడం లేదు అని చెప్పగా ఇప్పటికే సమయం నాలుగు అయింది మీరు వెంటనే ఈ పని చేయకపోతే పొద్దున్నే విగ్రహాలను అసలు టచ్ చేయలేరు అంటూ రౌడీలకు చెబుతారు.

మరోవైపు తల్లి కూతుర్లంతా కలిసి డాన్స్ చేస్తూ ఉండగా రాజ్ బయటకు వస్తారు. రాజ్ ను చూసి అన్నపూర్ణ కనకం సైలెంట్ అవుతూ పక్కకు వెళ్ళగా రాజ్ మాత్రం ఎందుకు అలా వెళ్ళిపోయారు డాన్స్ చేయండి అనడంతో అప్పు కూడా రాజ్ ను తీసుకురావడంతో ముగ్గురు కలిసి సంతోషంగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. మరోవైపు రౌడీలు అందరూ కూడా కృష్ణమూర్తికి అడ్డుపడి తనని చుట్టుముడతారు. ఎవరు బాబు మీరంతా అని ఆయన అడగడంతో విగ్రహాలు కావాలి అని చెప్పగా విగ్రహాలు కొనడానికి వచ్చారా ఇవి అమ్మడానికి వీలు లేదు బాబు ఇవి ఆల్రెడీ వేరే వాళ్లకు అమ్మేశాము ఇవ్వడం కుదరదు అంటూ కృష్ణమూర్తి చెబుతారు.

మేము ఈ విగ్రహాలు కొనడానికి రాలేదు వీటిని ఎత్తుకెళ్లిపోవడానికి వచ్చాము అంటూ రౌడీలు మాట్లాడుతారు. దీంతో కృష్ణమూర్తి వారిని వేడుకోగా రౌడీలు మాత్రం కృష్ణమూర్తిని కొట్టి విగ్రహాలన్నింటిని దొంగలిస్తారు. అక్కడే ఉన్నటువంటి బంటీ ఈ విషయం వెంటనే కావ్య అక్క వాళ్లకు చెప్పాలని పరుగులు పెడతారు. విగ్రహాలు తీసుకువెళ్లద్దని ఎంత బ్రతిమలాడినా వినకుండా రౌడీలు తనని కొట్టి విగ్రహాలన్నింటిని ఎత్తుకెళ్లిపోతారు. మరోవైపు రాజ్ కావ్య అప్పు సంతోషంగా డాన్స్ చేస్తూ ఉండగా అక్కడికి పరుగులు పెడితే వచ్చిన బంటిని చూసి ఏమైంది అనడంతో పెదనాన్నను కొట్టి విగ్రహాలన్నీ తీసుకెళ్లి పోతున్నారు అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు వెంటనే అందరూ అక్కడికి బయలుదేరుతారు.

అప్పటికే కృష్ణమూర్తి స్పృహ కోల్పోయి ఉంటారు. కుటుంబ సభ్యులందరూ రావడంతో కృష్ణమూర్తి జరిగినది మొత్తం చెప్పగా కుటుంబం మొత్తం కన్నీళ్లు పెట్టుకొని ఉంటారు అంతలోపే కాంట్రాక్టర్ వచ్చి నాకు ఇప్పటికే విగ్రహాలు కావాలి లేదంటే నేను ఆత్మహత్య చేసుకోవడమే మార్గం. ఇల్లు పొలం తాకట్టు పెట్టి ఈ కాంట్రాక్టు కోసం డబ్బులు తెచ్చాను అంటూ గొడవ చేస్తారు. ఇకపోతే రాజ్ ఆ విగ్రహాలను దొంగతనం చేసింది ఎవరు అనే విషయాలను ఆలోచిస్తూ ఉండగా వాటిని డీసీఎం వ్యాన్ లో తరలించారు అని చెబుతారు. వెంటనే అప్పు బండి నెంబర్ ఏదైనా గుర్తుందా బావ అనడంతో రాజ్ బండి నెంబర్ చెప్పగా సరే నేను ఇప్పుడే నా దోస్తులను తీసుకెళ్లి ఎక్కడున్నా పట్టుకుంటాను అని అప్పు బయలుదేరుతుంది.

రాజ్ కూడా వారిని గుర్తించడం కోసం బయలుదేరుతారు మరోవైపు కావ్య తన తండ్రికి ధైర్యం చెబుతూ ఉంటుంది. ఇక రౌడీలు రాహుల్ కి ఫోన్ చేసి విగ్రహాలన్నింటినీ దొంగలించాము. వీటిని ఏం చేయాలి సార్ అని అడగడంతో వాటిని ఎక్కడ పెట్టినా కనుక్కొనే అవకాశాలు ఉన్నాయి అందుకే ఆ విగ్రహాలన్నింటిని చెరువులో పడేయండి అని రాహుల్ చెబుతాడు. చెరువులో ఎందుకు పడేయాలి ఎక్కడైనా అమ్మేస్తే డబ్బులు వస్తాయి సార్ అంటూ రౌడీలు చెప్పడంతో మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను ముందు చెప్పిన పని చేయండి అనడంతో ఆ రౌడీలు విగ్రహాలను చెరువు వైపుకు తీసుకువెళ్తారు మరోవైపు రాజ్ అప్పు ఆ వ్యాన్ కోసం వెతుకుతూ ఉంటారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus