Rahul Ramakrishna: ఒట్టేసి చెబుతున్నా… ఆ విషయం నాకు తెలియదు క్షమించండి!

వెండితెర సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రాహుల్ రామకృష్ణ తాజాగా సోషల్ మీడియా వేదికగా రైలు ఘటనకు సంబంధించి ఒక వీడియోని ట్విటర్ వేదికగా షేర్ చేశారు దీంతో ఈ వీడియో పై నేటిజన్స్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాద ఘటన అందరిని ఎంతగా కలిచి వేసిందో అందరికీ తెలిసిందే. ఒకేసారి మూడు రైళ్లు ప్రమాదానికి గురి కావడంతో వందల మంది ప్రాణాలు కోల్పోగా వేల సంఖ్యలో ప్రయాణికులు గాయాలు పాలయ్యారు.

ఇలా ప్రమాదం జరిగిందనే విషయం తెలియడంతో టాలీవుడ్ సెలబ్రిటీలందరూ ఈ ప్రమాద ఘటన పై దిగ్బ్రాంతి వ్యక్తం చేయడమే కాకుండా క్షతగాత్రులకు సహాయం చేయడానికి ముందుకు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి విపత్కర సమయంలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈయన ట్విట్టర్ వేదికగా హాలీవుడ్ నటుడు బస్టర్ కీటన్ సైలెంట్ అనే సినిమాలో రైలు ముందు చేసే విన్యాసాలకు సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియో షేర్ చేసిన కొంత సమయానికి డిలీట్ చేసినప్పటికీ అప్పటికే ఇది కాస్త వైరల్ గా మారింది.దీంతో పలువురు నెటిజెన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ అసలు కొంచమైన మీకు బుద్ధుందా ఒకపక్క ప్రాణాలు కోల్పోయి కొన్ని వందల కుటుంబాలు శోక సంద్రంలో మునిగి ఉండగా మీకు కామెడీగా అనిపిస్తుందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో డిలీట్ చేసిన రాహుల్ రామకృష్ణ మరొక ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ఒట్టేసి చెబుతున్న నాకు ఈ రైలు ప్రమాద ఘటన ఏమాత్రం తెలియదని తెలిపారు.తాను గత రాత్రి నుంచి స్క్రిప్ట్ రాసే పనిలో ఉన్నానని అందుకే తాను న్యూస్ అప్డేట్ అవ్వలేదని తెలియజేశారు. తనకు ఈ విషయం తెలియకపోవడంతోనే అలాంటి ట్వీట్ చేశానని అందుకు తనను ప్రతి ఒక్కరు క్షమించాలి అంటూ క్షమాపణలు కోరుతూ ఈయన చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus