Rahul Ravindran: అందాల రాక్షసి టైంలోనే పడిపోయాను!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సింగర్ చిన్మయి నటుడు రాహుల్ రవీందర్ ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ వివాహం చేసుకొని తొమ్మిది సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. తాజాగా వీరిద్దరూ బుల్లితెరపై వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అలా మొదలైంది కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాహుల్ రవీందర్ చిన్మయి ఇద్దరు కూడా వారి ప్రేమ పెళ్లి గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.

వెన్నెల కిషోర్ (Rahul Ravindran) రాహుల్ రవీందర్ ని ప్రశ్నిస్తూ అసలు మీ కథ ఎలా మొదలైంది అని అడగగా ఈయన సమాధానం చెబుతూ..నాకు మొదటి నుంచి తన వాయిస్ అంటే చాలా ఇష్టం నేను నటించిన రెండో సినిమాలోని ఈమె డబ్బింగ్ చెప్పారు. అప్పటికే తాను గొప్ప సింగర్ అని రాహుల్ రవీందర్ తెలిపారు. డబ్బింగ్ చెప్పిన తర్వాత సినిమా టీం అందరిని ఈమె టాగ్ చేస్తూ సినిమా బాగుందని రామాయణంలో ఏదో కొటేషన్ పెట్టింది దాంతో అమ్మాయి బాగుంది తన ఆలోచనలు బాగున్నాయని ఆ క్షణమే తనకు పడిపోయానని రాహుల్ రవీందర్ తెలిపారు.

ఆ క్షణం నుంచి ఒకరికొకరు మెసేజ్లు పెట్టుకోవడం ప్రారంభించాం ఇంత అందమైన అమ్మాయి సింగిల్ గా ఉందా అని తెలిసి ఆశ్చర్యపోయానని, ఈమె సింగిల్ గా ఉంది అంటే ప్రపంచంలో అబ్బాయిలందరూ వేస్ట్ అనిపించిందని రాహుల్ తెలిపారు. ఇక చిన్మయి కూడా మాట్లాడుతూ…అందాల రాక్షసి సినిమాలో లావణ్య త్రిపాటికి డబ్బింగ్ చెప్పాను. ఆ సమయంలో సినిమా విశేషాలు చెప్పడానికి రాహుల్ తన వద్దకు వచ్చారని తెలిపారు.

అప్పుడే మొదటిసారి తనని చూసానని చిన్మయి వెల్లడించారు.ఇలా ఈ సినిమా ద్వారా మా ఇద్దరి పరిచయం ఏర్పడడం ఆపరిచయం ప్రేమ పెళ్లి వరకు దారి తీయడం జరిగిందంటూ ఈ సందర్భంగా వీరిద్దరూ తమ పెళ్లి గురించి పలు విషయాలను తెలియజేశారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus