Rahul Ravindran, Chinmayi: తనలో లేని టాలెంట్ వెతకాలి: రాహుల్ రవీంద్రన్

టాలీవుడ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి వారిలో రాహుల్ రవీంద్రన్ సింగర్ చిన్మయి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎన్నో వివాదాలకు కారణమవుతూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఈమె చేస్తే పోస్టులు పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి. ఇకపోతే తాజాగా రాహుల్ తన భార్య చిన్మయి తన ఇద్దరు పిల్లలతో కలిసి బాస్కెట్ బాల్ ఆడుతూ ఉన్నటువంటి ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

వీడియోలో చిన్మయి టాలెంట్ చూసి అంతా ఫిదా అవ్వాల్సిందే. బాస్కెట్ బాల్‌ను మూడు సార్లు ఫీల్డ్ గోల్ వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు ఆమె ఎప్పుడు బాస్కెట్ బాల్ ఆడలేదు కానీ ట్రై చేయమని చెప్పగా ఇంత అద్భుతంగా ఆడిందని రాహుల్ తెలిపారు. ఇక ఈ వీడియో పై ఎంతోమంది నేటిజన్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ అయితే చిన్మయి గురించి ప్రతిసారి మీరు ఇలాంటి పోస్ట్లు చేస్తూ ఉంటారు. గతంలో కూడా ఆమె స్విమ్మింగ్ గురించి పోస్ట్ చేశారని తెలిపారు.

ఇలా నేటిజన్ చేసినటువంటి కామెంట్ పై రాహుల్ స్పందిస్తూ అవును నేను తనలో ఏ టాలెంట్ లేదో వెతకాలి అంటూ కామెంట్ పెట్టారు. ఇక గత కొంతకాలంగా చిన్మయిని కోలీవుడ్ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిన విషయం మనకు తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత తిరిగి ఈమె లియో సినిమా కోసం ఒక పాటను పాడారు. కోలీవుడ్ రచయిత వైరముత్తు పై లైంగిక ఆరోపణలు చేయడంతోనే ఈమెను (Chinmayi) కోలీవుడ్ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus