Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి సందడి షురూ..ఫోటోలు వైరల్

‘బిగ్ బాస్ సీజన్ 3’ విన్న‌ర్‌, స్టార్ సింగర్ అయిన రాహుల్ సిప్లిగంజ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన బిజినెస్మెన్ కూతురు హరిణ్యా రెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆగస్టు 17న ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ మధ్య వీరి నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది.ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. అయితే పెళ్లి డేట్ ఎప్పుడు అనేది అనౌన్స్ చేసింది లేదు.

Rahul Sipligunj

మొత్తానికి ఇరుకుటుంబ సభ్యులు వీరి పెళ్లి డేట్ ఫిక్స్ చేయడానికి రెడీ అయినట్టు తెలుస్తుంది. తాజాగా లగ్న పత్రిక కూడా రాసుకున్నారు అని రాహుల్, హారణ్యా రెడ్డి తమ సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. అలాగే కొన్ని ఫోటోలు కూడా షేర్ చేశారు. అవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.రాహుల్ సిప్లిగంజ్ గతంలో తోటి ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్ పునర్నవి భూపాలంతో ప్రేమాయణం నడిపినట్టు టాక్ వినిపించింది.

హౌస్ నుండి బయటకు వచ్చాక కూడా వీరు కలిసి తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ రతిక రోజ్ తో కూడా రాహుల్ ప్రేమాయణం నడిపినట్టు టాక్ వినిపించింది. రతిక హౌస్ లోకి వెళ్లే ముందు.. పరోక్షంగా రాహుల్ సిప్లిగంజ్ గురించి పరోక్షంగా సెటైర్లు విసరడం జరిగింది.అలాగే అషురెడ్డి, నందినీ రాయ్ వంటి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో కూడా రాహుల్ సిప్లిగంజ్ కి ఎఫైర్ ఉన్నట్టు ప్రచారం జరిగింది.

అయితే మరో అమ్మాయిని రాహుల్ పెళ్లి చేసుకోవడంతో పాటు తనపై ఉన్న ప్రేమ వార్తలు కూడా అబద్దమని చాటి చెప్పినట్టు అయ్యింది.

స్టార్ హీరోలకు దూరంగా బండ్ల గణేష్.. వాళ్ళే టార్గెట్ గా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus