Rahul Sipligunj: నాకు ఏడుపొస్తోంది.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్ పోస్ట్!

బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్.. ఫైనల్స్ వరకు నిలిచి విన్నర్ గా ట్రోఫీ అందుకున్నాడు. హౌస్ లో ఉన్నంతకాలం పునర్నవి భూపాళంతో ఎంతో క్లోజ్ గా ఉండేవాడు రాహుల్. పునర్నవి ఏకంగా రాహుల్ ని ముద్దుపెట్టుకొని షాకిచ్చింది. అతడిని స్పెషల్ గా ట్రీట్ చేసేది. హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత కూడా ఈ జంట పార్టీలంటూ కలిసి తిరిగేవారు. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని.. త్వరలోనే పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు ఊపందుకున్నాయి.

కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ మధ్యకాలంలో రాహుల్.. అషురెడ్డితో సన్నిహితంగా మెలుగుతున్నాడు. ఇద్దరూ కలిసి బయట తిరగడం, ఒకరి గురించి ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటి విషయాలు చర్చనీయాంశంగా మారాయి. మొన్నామధ్య రాహుల్.. అషురెడ్డిని ఎత్తుకున్న ఫోటోలు షేర్ చేయడంతో.. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు జోరుగా వినిపించాయి. తాజాగా మరోసారి వీరిద్దరి రిలేషన్షిప్ చర్చలు వచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాహుల్ కి అషురెడ్డితో రిలేషన్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

వీటిపై స్పందించిన రాహుల్.. అషు తనకు స్పెషల్ అని.. తను చూపించే కేరింగ్ ఎంతో ఇష్టమని చెప్పాడు. అయితే తమ మధ్య డేటింగ్ లాంటిది ఏమీ లేదని.. అషురెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమేనని చెప్పాడు. ఓ సందర్భంలో తనకు డబ్బు అవసరమైన అషుని రూ.10 వేలు అడిగితే.. ఆమె ఆలస్యం చేయకుండా తనకు డబ్బు పంపిందని.. మరొకరి దగ్గర అలా నిర్మొహమాటంగా అడగలేనని చెప్పుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూ చూసిన అషురెడ్డి ఎమోషనల్ అయింది. ”థాంక్యూ రాహుల్.. నాకు ఏడుపొస్తోంది.. నువ్ ఎప్పటికీ ఎంతో స్పెషల్” అంటూ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో రాసుకొచ్చింది.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus